Maruti Suzuki Ertiga Mileage 7 Seater Car: కార్లు కొనాలనుకునే వారు ముఖ్యంగా చూసుకునే అంశం మైలేజీ. ఎందుకంటే కారు మంచి మైలేజీ ఇస్తే మనకు బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. భారతదేశంలో అత్యధిక మైలేజీని ఇచ్చే 7 సీటర్ కారు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ కారు పేరు మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga). ఇది తనకు సంబంధించిన సెగ్మెంట్లో ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్లలో ఒకటి. మారుతి సుజుకి ఎర్టిగాలో ఉన్న ఫీచర్లు అన్నిటినీ వినియోగదారులకు కావాల్సిన అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తీసుకువచ్చారు.


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


మారుతి సుజుకి ఎర్టిగా మైలేజ్ ఎంత? (Maruti Suzuki Ertiga Mileage)
మారుతి సుజుకి ఎర్టిగా మైలేజీ గురించి చెప్పాలంటే... దాని పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 20.3 కిలొ మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా సీఎన్‌జీ వేరియంట్ కిలో గ్రాముకు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కారు ఇంజన్ విషయానికి వస్తే... 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మారుతి సుజుకి ఎర్టిగా మార్కెట్లోకి వస్తుంది.


మారుతి సుజుకి ఎర్టిగా స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే ఈ కారును మార్కెట్లో అద్భుతమైన ఎంపీవీగా పరిగణించవచ్చు. ఈ ఏడు సీట్ల కారులో 1462 సీసీ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 101.64 బీహెచ్‌పీ పవర్‌ని, 136.8 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ తెలుపుతున్న వివరాల ప్రకారం మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని కూడా అందిస్తుంది.


అలాగే ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఏబీఎస్ విత్ ఈబీడీ, అల్లాయ్ వీల్స్, పవర్ విండోస్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందించారు. మారుతి సుజుకి ఎర్టిగా కూడా సీఎన్‌జీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అదే సమయంలో ఈ కారు మార్కెట్లో కియా కారెన్స్ వంటి ఎంపీవీలకు ప్రత్యక్ష పోటీని ఇస్తుంది. 


Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి