Maruti Celerio Finance Plan: మారుతి సుజుకి కార్లను భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. భారతీయులు ఎక్కువ ఇష్టపడతారు. కంపెనీ సెలెరియో కూడా ఇండియన్ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్. సెలెరియో CNG తన అద్భుతమైన మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్ సేఫ్టీతో వస్తుంది.
మీరు సెలెరియో CNG వేరియంట్ VXIని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ కారు ఫైనాన్స్ ప్లాన్ గురించి ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాము. ఈ కారును మీరు ఎంత డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. సెలెరియో VXI CNG రెండు ట్యాంకులు పూర్తిగా నింపడం ద్వారా సులభంగా 1000 KM వరకు ప్రయాణించవచ్చు.
మారుతి సెలెరియో CNG ధర ఎంత?
మారుతి నుంచి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వస్సెతోంది. లెరియో VXI వేరియంట్ ధర 6.90 లక్షల రూపాయలు ఎక్స్-షోరూమ్. హైదరాబాద్‌లో దాదాపు 78,960 రూపాయలు RTO ఫీజు వసూలు చేస్తారు. దాదాపు 27,665 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాలి. దీని తర్వాత మారుతి సెలెరియో VXI ఆన్-రోడ్ ధర దాదాపు 8,18,094 రూపాయలు ఉంటుంది.
EMI ఎంత చెల్లించాలి?
మీరు 50,000 రూపాయల డౌన్ పేమెంట్‌తో మారుతి సెలెరియో CNGని కొనుగోలు చేస్తే, మీరు 7,68,094 లక్షల రూపాయల కార్ లోన్ తీసుకోవాలి. మీరు బ్యాంకు నుంచి 9.8 శాతం వడ్డీ రేటుతో ఈ డబ్బులను లోన్‌గా ఏడేళ్ల కోసం తీసుకుంటే నెలకు 12,672 రూపాయల ఈఎంఐ చెల్లించాలి. అదే ఆరేళ్ల కోసం ఈ లోన్ తీసుకుంటే నెలకు 14,152 రూపాయలు చెల్లించాలి. ఇదే డబ్బులు ఐదేళ్ల కోసం తీసుకుంటే మాత్రం 16,244 రూపాయలు ఈఎంఐగా కట్టాలి. అలాంటప్పుడు మీ జీతం 40 వేల రూపాయల మేరకు ఉంటే ఏడేళ్లకు తీసుకుంటే ఈజీగా ఈఎంఐ చెల్లించవచ్చు. మీరు చెల్లించే డౌన్ పేమెంట్ ఆధారంగా కూడా ఈఎంఐ, వడ్డీ రేటు బ్యాంకులు వేస్తాయి.
Maruti Celerio CNG పవర్
ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారులో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది, ఇది 67 PS పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. దీని CNG వెర్షన్‌లో ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది . ఇది 56.7PS పవర్ , 82 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 60 లీటర్ల CNG ట్యాంక్ లభిస్తుంది.
మారుతి సుజుకి సెలెరియోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, EBDతో ABS, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా సదుపాయాలు లభిస్తాయి. సెలెరియో పొడవు 3695 మిల్లీమీటర్లు, వెడల్పు 1655 మిల్లీమీటర్లు, ఎత్తు 1555 మిల్లీమీటర్లు. అంతేకాకుండా సెలెరియోలో 313 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
మారుతి సెలెరియోలో లభించే ఫీచర్లు
మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ దాదాపు 26 కిలోమీటర్లు ప్రతి లీటరు మైలేజ్ ఇస్తుంది, అయితే CNG వేరియంట్ దాదాపు 34 km ప్రతి కిలోగ్రాము మైలేజ్ ఇస్తుంది. ఇందులో Apple CarPlay, Android Autoతో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AC వెంట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.