Discount On Maruti Suzuki Alto K10: భారతీయ మార్కెట్లో అత్యంత చవకైన కారుగా మారుతి సుజుకి ఆల్టో K10 గురించి చెప్పుకోవచ్చు. సైజ్‌లో ఈ కారు కొంచెం చిన్నదే అయినప్పటికీ, మైలేజ్ పరంగా మేటి. అందుకే, ఈ కారు చాలా మందికి, ముఖ్యంగా సగటు భారతీయుడికి బాగా నచ్చుతుంది. మీ రోజువారీ ప్రయాణం లేదా కుటుంబ అవసరాల కోసం ఆల్టో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు గొప్ప అవకాశం. ఈ నెలలో, మారుతి సుజుకీ, ఆల్టో కారు మీద బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది.
దిల్లీ-NCRలో ఉన్న డీలర్‌షిప్‌ల ప్రకారం, ఆల్టో K10 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మీద రూ. 62,500, ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 67,500 & CNG (మాన్యువల్) వేరియంట్ మీద రూ. 62,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కేవలం క్యాష్ డిస్కౌంట్ మాత్రమే, దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు & కార్పొరేట్ ఆఫర్లు కూడా యాడ్ అవుతాయి. వివిధ రాష్ట్రాల్లో ఈ ఆఫర్లలో కొద్దిపాటి తేడాలు ఉండవచ్చు.
ఆల్టో K10 ధర ఎంత? దేశంలోనే అత్యంత చవకైన మారుతి సుజుకి ఆల్టో K10 ధర గట్టిగా నాలుగున్నర లక్షల రూపాయలు కూడా లేదు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర (Maruti Suzuki Alto K10 ex-showroom price) రూ. 4.23 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. RTO, బీమా, ఇతర ఖర్చులు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోడల్ ఆన్-రోడ్ రేటు (Maruti Suzuki Alto K10 on-road price) దాదాపు రూ. 7.40 లక్షలు అవుతుంది. అంటే, టాప్-ఎండ్ మోడల్ కూడా కామన్ మ్యాన్‌కు అందుబాటులో ధరలోనే ఉంది. Alto K10 LXi S-CNG వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.90 లక్షలు.
ఆల్టో K10 ఇంజిన్ పవర్ మారుతి సుజుకి ఆల్టో K10 ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. కంపెనీ, ఈ కారులో 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 66 bhp పవర్‌ను ఇస్తుంది & 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు, దీనివల్ల బండి స్మూత్ రన్నింగ్ వీలవుతుంది.
మారుతి సుజుకి ఆల్టో మైలేజ్ ఎంత?చూడడానికి ఆల్టో K10 చిన్నగా ఉన్నప్పటికీ ఇది మైలేజ్‌లో పెద్దన్న. ఈ కారులో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం, ఆల్టో K10 పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 25 కి.మీ. మైలేజీ అందిస్తుంది. ఈ కారు యొక్క CNG వేరియంట్ 34 కి.మీ. వరకు మైలేజీని ఇవ్వగలదు.
ఫీచర్లలోనూ తక్కువ కాదుమారుతి సుజుకి ఆల్టో K10లో AC, ఫ్రంట్ పవర్ విండో, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, ESP, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ప్రి-టైటెనింగ్ సీట్‌బెల్ట్స్ వంటి అనేక గొప్ప ఫీచర్లు ఈ కారు సొంతం.