Maruti Invicto Price, Mileage And Features In Telugu: టయోటా బ్రాండ్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న హైబ్రిడ్ MPV Innova Hycross చాలా మందికి నచ్చింది. కానీ మార్కెట్లో మరో కారు ఉంది, ఇది సరిగ్గా ఇన్నోవా లాంటిదే. ఆ కారు మారుతి ఇన్విక్టో (Maruti Invicto). ఇది ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్‌డ్‌ వెర్షన్. ఈ MPV పై ఈ నెలలో (ఆగస్టు, 2025) చాలా డిస్కౌంట్లు & ఆఫర్లు ఉన్నాయి. 

ఆటోకార్ రిపోర్ట్‌ ప్రకారం, ఈ నెలలో మారుతి ఇన్విక్టో కొంటే గరిష్టంగా రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు (Maruti Invicto Discount August 2025) లభిస్తుంది. ఇందులో నగదు ఆఫర్లు & స్క్రాపేజ్ బోనస్ కూడా కలిసి ఉన్నాయి. ఇంకా, కొన్ని డీలర్‌షిప్‌లలో పాత స్టాక్‌ మీద రూ. 1 లక్ష వరకు తగ్గింపు ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో మారుతి ఇన్విక్టో ధరలుమారుతి ఇన్విక్టో బేస్‌ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర (Maruti Invicto ex-showroom price, Hyderabad Vijayawada) రూ. 25.51 లక్షల నుంచి రూ. 29.22 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర (Maruti Invicto on-road price, Hyderabad) దాదాపు రూ. 31.40 లక్షలు అవుతుంది. ఆన్‌-రోడ్‌ ధరలో, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రిజిస్ట్రేషన్‌ ఖర్చు దాదాపు రూ. 4.61 లక్షలు, బీమా రూ. 1 లక్ష, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర (Maruti Invicto on-road price, Vijayawada) దాదాపు రూ. 31.25 లక్షలు అవుతుంది. ఇతర తెలుగు నగరాల్లో దీని ఆన్-రోడ్ ధర కొద్దిగా మారవచ్చు.              

వేరియంట్లుమారుతి ఇన్విక్టో కారు 7 & 8 సీటింగ్ లేఅవుట్‌లలో లభిస్తుంది. ఇది, ఆల్ఫా ప్లస్ (Alpha Plus) & జీటా ప్లస్ (Zeta Plus) అనే రెండు పవర్‌ఫుల్‌ వేరియంట్లతో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లలో ఒకే రకమైన బ్రేక్‌లు ఉపయోగించారు. ఇన్విక్టో ముందు భాగంలో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో సాలిడ్ డిస్క్ బ్రేక్‌లను ఉన్నాయి. ఈ మారుతి కారులో 215/60 R17 ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.           

మారుతి ఇన్విక్టో పవర్‌ట్రెయిన్ & మైలేజ్మారుతి ఇన్విక్టోలో, టయోటా ఇన్నోవా హైక్రాస్ లాంటి 2-లీటర్ పెట్రోల్/హైబ్రిడ్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 112 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది & 4,400-5,200 rpm వద్ద 188 Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. ఈ కారు రెండు వేరియంట్లలో e-CVT ట్రాన్స్‌మిషన్‌తో టూ-వీల్ డ్రైవ్ (2WD) ఉంది. ARAI ప్రకారం, మారుతి ఇన్విక్టో 23.24 kmpl మైలేజీని (Maruti Invicto Mileage) ఇస్తుంది.