Maruti Suzuki Ignis Radiance Edition Launched: మారుతి సుజుకి ఇగ్నిస్ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను రేడియన్స్‌ని విడుదల చేసింది. ఈ వెర్షన్‌లో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో భారీ మార్పులను చేసింది. ఇది ఇప్పటికే ఉన్న ఇగ్నిస్ మోడల్‌లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. రేడియన్స్ ఎడిషన్ దాని స్టైలిష్ లుక్, అధునాతన ఫీచర్లతో ప్రస్తుత మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌లకు సవాలు విసురనుంది.



ఈ రేడియన్స్ స్పెషల్‌ ఎడిషన్‌ని ఎడిషన్ ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా సంస్థ నిర్ణయించింది. ఇది బేస్‌ వేరియంట్‌ సిగ్మా కంటే రూ. 35,000 తక్కువగా ఉండనుంది. సిగ్మా వేరియంట్‌ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. తక్కువ ధరలో స్పెషల్‌ ఎడిషన్‌ని తీసుకురావడంపై చాలా మంది ఆటో రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ప్రత్యేక ఎడిషన్లు సాధారణంగా ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి. అయితే, వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్నిసార్లు ప్రత్యేక ఎడిషన్లను సైతం తక్కువ ధరకు విడుదల చేసిన ఘనత మారుతి సుజుకికి ఉంది.


ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్ అనేక అదనపు ఫీచర్లతో వస్తుంది. ఇందులో స్ట్రాంగ్‌ బానెట్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, రూఫ్ రెయిల్‌లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కొత్త యాడింగ్స్‌తో ఈ హ్యాచ్‌బ్యాక్‌ మరింత కొత్తగా కనిపించనుంది. ఇక ఇంటీరియర్‌లో మీడియం-సైజ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్లు బిగ్ సైజ్‌ ఎస్‌యూవీలో లభించే ఇంటీరియర్‌లకు సమానంగా ఉంటాయి. 




సేఫ్టీ, ఇంజిన్
ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్‌లో మీరు ఎటువంటి భయం లేకుండా ప్రయాణించవచ్చు.  ఎందుకంటే ఈ కారులో సేఫ్టీకి మారుతి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. సుజుకి అందించే టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ (TECT) ప్లాట్‌ఫారమ్‌పై దీనిని మారుతి నిర్మించింది. ఇది ప్యాసింజర్స్‌కి మెరుగైన సేఫ్టీని అందిస్తుంది. ఇక ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.


Also Read: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?


ఇక ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్ ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 1.2-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 89bhp, 113nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ మధ్య ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మారుతి సుజుకి ఇగ్నిస్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కొత్త స్పెషల్ ఎడిషన్ కస్టమర్ల కోసం మరో ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది.


ఇగ్నిస్ కార్లు ఏడు మోనోక్రోమ్, మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో వస్తాయి. ఈ రేడియన్స్ ఎడిషన్ లాంచ్ భారతదేశంలో మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాలను పెంచుతుందని మారుతి భావిస్తోంది. ఇది భారత మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, సిట్రోయెన్ సి3 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్‌ను ఇతర మోడల్‌లతో పాటు నెక్సా షోరూమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Also Read: ఎర్టిగాకు పోటీనిచ్చే కియా కొత్త కారు - సెవెన్ సీటర్లలో కింగ్ కానుందా?