Mahindra XUV700 Waiting Period: మహీంద్రా ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఎక్స్‌యూవీ700 అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. ఈ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో అందుబాటులో ఉంది. 5, 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని జనాదరణ ఎంతగా ఉంది అంటే ఎక్స్‌యూవీ700 వచ్చినప్పటి నుండి, దాని వేరియంట్‌ల్లో చాలా కార్లకు వెయిటింగ్ పీరియడ్ ఎంతో ఎక్కువగా ఉంది. ఆటోకార్ ఇండియా కథనాల ప్రకారం ఇప్పుడు అన్ని వేరియంట్ల విషయంలో వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల కంటే తక్కువకు తగ్గింది. ఇక్కడ వేరియంట్ వారీగా వెయిటింగ్ పీరియడ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.


మహీంద్రా ఎక్స్‌యూవీ700 వెయిటింగ్ పీరియడ్ ఎంత?
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎంట్రీ లెవల్ ఎంఎక్స్, ఏఎక్స్2 మిడ్ లెవల్ ఏఎక్స్5 కోసం వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా ఉంది. డెలివరీల కోసం కొనుగోలుదారులు 45 రోజులకు పైగా వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈఎస్‌పీ ఎక్విప్డ్ వేరియంట్‌ల ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?


మహీంద్రా ఎక్స్‌యూవీ700 పవర్‌ట్రెయిన్
ఎక్స్‌యూవీ700 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 200 హెచ్‌పీ పవర్‌ని, 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ 155 హెచ్‌పీ పవర్, 360 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హై స్పెక్ వేరియంట్‌లో ఇది 185 హెచ్‌పీ, 420 ఎన్ఎంట (ఏటీతో 450 ఎన్ఎం) అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్‌తో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధర ఎంత?
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 26.99 లక్షల మధ్య ఉంటుంది. ఇది టాటా హారియర్, సఫారీ, ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్, జీప్ కంపాస్ వంటి ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.



Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!