Mahindra Electric Car: మహీంద్రా ఆటో ప్రస్తుతం అనేక ఎలక్ట్రిక్ వాహనాలపై పని చేస్తోంది. ఇప్పుడు మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు వార్తల్లోకి వచ్చింది. దీని పేరు మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9. 2025 నాటికి ఈ కారును మహీంద్రా భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారు మనదేశంలో టెస్టింగ్‌లో చాలా సార్లు కనిపించింది. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.


సూపర్ ఫీచర్లు కూడా...
మహీంద్రా త్వరలో లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక శక్తివంతమైన ఫీచర్లను కూడా చూడవచ్చు. ఈ కారులో రెండు వరుసల సీట్లు ఉండనున్నాయి. ఈ కారును ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. దీంతో పాటు ఇందులో పెద్ద బూట్ స్పేస్ కూడా ఉండనుంది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించగలదు.


మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 క్యాబిన్‌లో తేలికపాటి సీట్లు, ఆటోమేటిక్ గేర్ లివర్ కూడా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఆటో హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఈ కారులో కనిపిస్తాయి.



Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్


వావ్ అనిపించే రేంజ్ కూడా...
మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ.ఈ9 అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారుకు 80 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్‌తో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ సహాయంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 దాదాపు 400 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.


ఎంత ధర ఉండవచ్చు?
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ధర గురించి మహీంద్రా ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని షేర్ చేయలేదు. కానీ మహీంద్రా దీన్ని దాదాపు రూ.35 నుంచి 40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేయగలదని విశ్వసిస్తున్నారు. అలాగే ఈ కారు బీవైడీ అట్టో 3 వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు.


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి