Mahindra Scorpio Classic S5: ప్రముఖ వాహనాల తయారీదారు కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన స్కార్పియో ఎస్‌యూవీని గత సంవత్సరం కొత్త వెర్షన్‌లో లాంచ్ చేసింది. దీంతో పాటు కొత్త SUV స్కార్పియో-N కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇది స్కార్పియో క్లాసిక్ కంటే పూర్తిగా కొత్త డిజైన్‌తో వచ్చింది. ఈ రెండు ఎస్‌యూవీ కార్లు ప్రస్తుతం మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే, కొత్త స్కార్పియో ఎన్ వచ్చిన తర్వాత కూడా స్కార్పియో క్లాసిక్‌కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.


కొత్త ఆర్‌డీఈ ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీ తన స్కార్పియో క్లాసిక్‌లోని ఇంజిన్‌లను త్వరలో అప్‌గ్రేడ్ చేస్తుంది. దీంతో పాటు మహీంద్రా ఈ SUV కోసం మిడ్-స్పెక్ వేరియంట్ S5 ను కూడా విడుదల చేస్తుంది. ఈ కొత్త S5 వేరియంట్ దాని దిగువ వేరియంట్ S, టాప్ వేరియంట్ S11 మధ్యలోకి రానుంది. ప్రస్తుతం ఇది బేస్ వేరియంట్‌లో 9-సీట్ల ఆప్షన్‌ను మాత్రమే పొందుతుంది. అయితే దాని కొత్త S5 వేరియంట్ 7, 9 సీట్ల ఆప్షన్లలో వస్తుంది.


ఫీచర్లు ఎలా ఉన్నాయి?
స్కార్పియో క్లాసిక్ S తొమ్మిది సీట్ల లే అవుట్‌తో రానుంది. రెండో వరుసలో మోడల్ బెంచ్ సీట్లు, వెనుకవైపు 2×2 బెంచ్ సీట్లు ఉంటాయి. అలాగే కొత్త వేరియంట్‌లో కవర్‌లతో కూడిన స్టీల్ వీల్స్, ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఓఆర్వీఎంలు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్‌ను పొందే అవకాశం ఉంది.


ఇంజిన్ ఎలా ఉంది?
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది BS6 స్టేజ్ II లేదా రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్స్ నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అవుతుంది. ఈ ఇంజన్ 130 బీహెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 - స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కంపెనీ కొత్త ఆర్డీఈ నిబంధనల ప్రకారం స్కార్పియో-ఎన్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను కూడా అప్‌డేట్ చేస్తుంది.


ఎంజీ హెక్టర్‌తో పోటీ?
ఈ కారు మార్కెట్లో ఎంజీ హెక్టర్‌తో పోటీపడుతుంది. ఇది 1.5 లీటర్, ఫోర్ - సిలిండర్, పెట్రోల్ ఇంజన్, 2.0 లీటర్ 4 - సిలిండర్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లాంచ్ అయింది. దీంతో పాటు అనేక అధునాతన ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.


మహీంద్రా తన మోస్ట్ అవైటెడ్ కొత్త స్కార్పియో ఎన్‌ను గతంలోనే మనదేశంలో లాంచ్ చేసింది. జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8, జెడ్8ఎల్ ట్రిమ్స్‌లో ఈ స్కార్పియోను మహీంద్రా తీసుకువచ్చింది. ఈ కొత్త స్కార్పియో-ఎన్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే ఇది పెద్దదిగా ఉండటమే కాకుండా లుక్ కూడా ప్రీమియం తరహాలో ఉంది.


దీని షాక్ అబ్జార్బర్లలో ఎంటీవీ సీఎల్ టెక్నాలజీని మహీంద్రా అందించింది. ఈ విభాగంలో ఈ తరహా టెక్నాలజీని అందించడం ఇదే మొదటిసారి. దీని ద్వారా రైడ్ మరింత కంఫర్టబుల్‌గా ఉండనుంది. కొత్త 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను ఇందులో అందించారు. మహీంద్రా అడ్రెనాక్స్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. హ్యుండాయ్ అల్కజార్, టాటా సఫారీలతో స్కార్పియో ఎన్ పోటీ పడనుంది.