Mahindra Thar ROXX and Ola Electric Bike Launching: 2024లో భారత స్వాతంత్ర్య దినోత్సవం దేశంలోని ఆటో మార్కెట్‌కు కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కార్ల తయారీ కంపెనీ మహీంద్రా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా తమ వాహనాలను ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయనున్నాయి. మహీంద్రా థార్ రోక్స్‌ను కంపెనీ భారతదేశంలో విడుదల చేయనుంది. అలాగే ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి పరిచయం చేయనుంది. ఈ రెండు కంపెనీలు అందిస్తున్న వాహనాల ప్రత్యేక ఫీచర్లను గురించి తెలుసుకుందాం.


మహీంద్రా థార్ రోక్స్ ప్రత్యేకతలు ఏంటి? (Mahindra Thar ROXX)
ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానున్న మహీంద్రా థార్ రాక్స్‌లో వినియోగదారులు అనేక గొప్ప ఫీచర్లను పొందనున్నారు. మీరు ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లను చూడవచ్చు. కానీ అవి ఎక్స్‌యూవీ700 లాగా కనెక్టెడ్ కాదన్న విషయం తెలుసుకోవాలి. కొత్త థార్‌లో కనిపించే స్క్రీన్ 3 డోర్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ కొత్త థార్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూడవచ్చు. కొత్త థార్‌లో 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా ఉంటుందని అంచనా.


దీంతో పాటు మహీంద్రా థార్ రోక్స్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ 3 డోర్ మోడల్‌లో కూడా లేదు. థార్ రోక్స్ కారు మెటల్ హార్డ్‌టాప్ రూఫ్‌ను పొందబోతోంది. మహీంద్రా తీసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్ కూడా ఆశించవచ్చు. ఎక్స్‌యూవీ700తో పోలిస్తే ఈ ఎస్‌యూవీలో అనేక తాజా ఫీచర్లను అందించే అవకాశం ఉంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ కూడా... (Ola Electric Bike)
ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనుంది. దీని టీజర్ ఇటీవల విడుదలైంది. బైక్ లుక్ చాలా స్లీక్‌గా, అద్భుతంగా ఉంది. ఇందులో సైడ్ ప్యానెల్, సింగిల్ సీట్ కాన్ఫిగరేషన్, టీఎఫ్‌టీ డాష్, ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ప్రత్యేక రియర్‌వ్యూ మిర్రర్ ఉన్నాయి.


బైక్ మెకానికల్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు ఇంకా బయటకి రాలేదు. అయితే బైక్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఉన్నాయి. భారత మార్కెట్లోకి విడుదల అయిన తర్వాత అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2, మ్యాటర్ ఎరా లేదా ఎంట్రీ లెవల్ రివోల్ట్ ఆర్వీ400, టార్క్ క్రాటోస్ ఆర్‌లతో పోటీపడుతుంది. ఇది కాకుండా బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. రెండు చక్రాలకు సింగిల్ డిస్క్‌ను అందించారు. 


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే