Mahindra Scorpio Lifestyler pickup truck: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త 'మహీంద్రా లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌'ను ఎట్టకేలకు దేశానికి పరిచయం చేశారు. 2023లో ప్రదర్శించిన గ్లోబల్‌ పికప్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ కొత్త వాహనాన్ని మహీంద్రా రూపొందించింది. ఈ పికప్‌ ట్రక్‌కు "స్కార్పియో లైఫ్‌స్టైలర్‌" అనే పేరు పెట్టింది.

Continues below advertisement

స్కార్పియో ఎన్‌ ఆధారంగా..స్కార్పియో లైఫ్‌స్టైలర్‌కు స్కార్పియో ఎన్‌లో ఉపయోగించిన బాడీ ఆన్‌ ఫ్రేమ్‌ ఛాసిస్‌నే వినియోగించారు. దీంతో ఇది మంచి ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. భారత మార్కెట్‌లో Toyota Hilux, Isuzu D-Max V-Cross కు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది.

ధరధర విషయంలో మహీంద్రా భారీ వ్యత్యాసం చూపబోతోంది. ఈ పికప్‌ ట్రక్‌ ప్రారంభ ధర రూ.19.79 లక్షల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 2027 ఏప్రిల్‌లోగా మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం.. టయోటా హైలక్స్‌, ఇసుజు డీ మ్యాక్స్‌ వీ క్రాస్‌ ప్రారంభ ధరలు రూ.25 లక్షలకు పైగానే ఉన్నాయి. అంటే ప్రత్యర్థులతో పోలిస్తే స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.

Continues below advertisement

రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ డిజైన్‌ చాలా దూకుడుగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఎత్తుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు ఉన్నాయి. వీటికి ఎల్‌ ఆకారంలోని డీఆర్‌ఎల్‌ లైటింగ్‌ ఉంటుంది. వెడల్పాటి హనీకోంబ్‌ గ్రిల్‌ ఆకట్టుకుంటుంది. గ్రిల్‌కు క్రోమ్‌ అలంకరణలు ఇచ్చారు. బానెట్‌ ముందుభాగంలో స్కార్పియో అనే పేరు కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!

కింది భాగంలో బలమైన స్కిడ్‌ ప్లేట్‌ ఉంది. దానిపై మహీంద్రా పేరు కనిపిస్తుంది. మెష్‌ తరహా ఎయిర్‌ డ్యామ్‌ & నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంపులు ఉన్నాయి.

పక్క నుంచి చూస్తే డబుల్‌ క్యాబ్‌ డిజైన్‌ కనిపిస్తుంది. డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌, మందపాటి సైడ్‌ క్లాడింగ్‌, రూఫ్‌ రైల్స్‌ ఉన్నాయి. బెల్ట్‌లైన్‌ మధ్యలో కింక్‌ డిజైన్‌ ఇచ్చారు. వెనుక భాగంలో సీ ఆకారంలోని డీఆర్‌ఎల్‌లతో పాటు నిలువుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంపులు ఉన్నాయి. బూట్‌ లిడ్‌పై పెద్దగా మహీంద్రా పేరు కనిపిస్తుంది. వెనుక బంపర్‌ కూడా ముందు భాగం తరహాలోనే రగ్‌డ్‌ డిజైన్‌తో ఉంటుంది.

మూడు ప్రత్యేక ఎడిషన్లుస్కార్పియో లైఫ్‌స్టైలర్‌ను మూడు ప్రత్యేక ఎడిషన్లలో తీసుకురానుంది. వ్యాలీ, రీఫ్‌, ట్రెయిల్‌ పేర్లతో ఇవి ఉంటాయి. వీటిని ఆర్టెమిస్‌ గ్రే, ఆక్వారీఫ్‌, సహారా బీజ్‌ రంగుల్లో అందిస్తారు. ఆయా ఎడిషన్లకు ప్రత్యేక డీకాల్స్‌ & యాక్సెసరీలు ఉంటాయి. పర్వతాలు, సముద్రాలు, ఎడారుల స్ఫూర్తితో వీటిని రూపొందించారు.

ప్రీమియం ఇంటీరియర్‌బయట నుంచి రఫ్‌గా కనిపించినప్పటికీ లోపల మాత్రం ప్రీమియం అనుభూతిని అందించేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. డ్యాష్‌బోర్డ్‌ మధ్యలో నిలువు ఆకారంలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంటుంది. దాని ఇరువైపులా ఏసీ వెంట్స్‌ ఉన్నాయి. కింద క్లైమేట్‌ కంట్రోల్‌ ప్యానెల్‌ & ఫిజికల్‌ కంట్రోల్స్‌ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!

డ్రైవర్‌ ముందు 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ & డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఉంటాయి. ట్రాన్స్‌మిషన్‌ టన్నెల్‌పై కూడా చాలా ఫిజికల్‌ కంట్రోల్స్‌ ఉంటాయి. వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, టెర్రైన్‌ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

స్కార్పియో ఎన్‌ ఇంజిన్లే?ఇంజిన్‌ విషయంలో స్కార్పియో లైఫ్‌స్టైలర్‌కు స్కార్పియో ఎన్‌లోని ఇంజిన్లనే ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో 175 హెచ్‌పీ సామర్థ్యంతో 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ & 203 హెచ్‌పీ సామర్థ్యంతో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండొచ్చు. 6 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 4WD సిస్టమ్‌ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మధ్యప్రాచ్యం & దక్షిణాఫ్రికా మార్కెట్లలోనూ ఈ పికప్‌ను విక్రయించనున్నారు. అయితే, ఇతర దేశాల్లో స్కార్పియో పేరును చేర్చకుండా కేవలం లైఫ్‌స్టైలర్‌ పేరుతోనే ఈ వాహనం అందుబాటులోకి రానుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.