JCB Hydromax hydrogen-powered car: JCB అనగానే సాధారణంగా మనకు భారీ యంత్రాలు, బుల్డోజర్లు గుర్తొస్తాయి. కానీ బ్రిటన్‌కు చెందిన ఈ ఇంజినీరింగ్ దిగ్గజ కంపెనీ, ఇప్పుడు పెను సంచలనం సృష్టించింది. హైడ్రోజన్‌ ఇంజిన్ కారుతో ఏకంగా ప్రపంచ ల్యాండ్ స్పీడ్ రికార్డును బద్దలు కొట్టింది.

Continues below advertisement

JCB రూపొందించిన హైడ్రోమ్యాక్స్‌ (Hydromax) స్పీడ్‌స్టర్ గంటకు 653.90 కిలోమీటర్ల సగటు వేగాన్ని అందుకుంది. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న బోన్నెవిల్లే సాల్ట్ ఫ్లాట్స్‌లో ఈ కారును పరీక్షించారు. ఈ రికార్డు ప్రయత్నంలో, ప్రముఖ డ్రైవర్ ఆండీ గ్రీన్ Hydromaxను నడిపాడు.

రెండు ఇంజిన్లు.. 1,622hp పవర్Hydromaxలో రెండు హైడ్రోజన్ కంబన్షన్‌ ఇంజిన్లు ఉన్నాయి. ఒక్కో ఇంజిన్ సామర్థ్యం 4.8 లీటర్లు. అంటే రెండు ఇంజిన్ల కలిపి సామర్థ్యం 9.6 లీటర్లు. ఇవి కలిసి ఏకంగా 1,622hp పవర్‌ ఇస్తారు. అధిక ఎత్తులో ఉన్న బోన్నెవిల్లే ప్రాంతంలో ఇంజిన్లకు తగిన పనితీరు అందించేందుకు సింగిల్-స్టేజ్ మోటార్‌స్పోర్ట్ టర్బోచార్జర్‌ను ఉపయోగించారు. అంతేకాదు.. Le Mans రేసింగ్ కారులో ఉపయోగించే స్పార్క్ ప్లగ్‌లను కూడా ఇందులో అమర్చారు.

Continues below advertisement

ముందు & వెనుక చక్రాలకు పవర్Hydromax పొడవు 9.75 మీటర్లు. దీన్ని స్టీల్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. కారులో రెండు ఇంజిన్లను ఛాసిస్‌కు ఇరువైపులా అమర్చారు. ఒక ఇంజిన్ ముందు యాక్సిల్‌కు పవర్ అందిస్తుంది. మరో ఇంజిన్ వెనుక యాక్సిల్‌ను నడుపుతుంది. రెండు ఇంజిన్లకూ ప్రత్యేకంగా 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇందులోని క్లచ్‌లను JCB డిగ్గర్ నుంచి తీసుకున్నారు. ఇలాంటి స్పీడ్ రికార్డు కారు కోసం అవసరమైన భారీ లోడ్లను మోటార్‌స్పోర్ట్ క్లచ్‌లు తట్టుకోలేవని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు

రెండు ప్రయత్నాల్లో రికార్డురికార్డు కోసం Hydromax రెండుసార్లు పరుగులు తీసింది. మొదటి రన్‌లో గంటకు 644.74 కిలోమీటర్ల సగటు వేగాన్ని నమోదు చేసింది. రెండో రన్‌లో గంటకు 663.26 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ రెండు ట్రయల్స్‌ సగటు వేగం గంటకు 653.90 కిలోమీటర్లు. దీంతో, 2004లో BMW H2R సాధించిన రికార్డు అడ్రస్‌ లేకుండాపోయింది. BMW H2R అప్పట్లో గంటకు 298.53 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది.

JCB ప్రకారం.. Hydromax సగటు వేగం ఆధారంగా చూస్తే చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రయాణించిన హైడ్రోజన్ వెహికల్‌గా నిలిచింది.

ప్రత్యేక డిజైన్Hydromaxలో డ్రైవర్ కూర్చునే భాగాన్ని కార్బన్ ఫైబర్ మోనోకోక్ సబ్-ఛాసిస్‌తో రూపొందించారు. గాలిని సులభంగా చీల్చుకువెళ్లేలా ముందు భాగానికి ప్రత్యేక ఆకృతిని ఇచ్చారు. దీంతో గాలి నిరోధకత తగ్గుతుంది.

హైడ్రోజన్ ట్యాంక్‌ను డ్రైవర్ సీటింగ్ భాగం వెనుక అమర్చారు. కారు ముందు భాగం కింద ప్రత్యేక ఛానళ్లను రూపొందించారు. బోన్నెవిల్లే సాల్ట్ ఫ్లాట్స్‌లోని ఉప్పు కారు కింద పేరుకుపోకుండా బయటకు వెళ్లేలా వీటిని డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి: పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!

వేగం పెరిగే కొద్దీ పెరిగే టైర్లుఇంతటి వేగాన్ని తట్టుకునేందుకు JCB ప్రత్యేకంగా కొత్త టైర్లను తయారు చేయించింది. అధిక వేగంలో ఈ టైర్లు కొంత విస్తరిస్తాయి. అందుకే ముందు చక్రాల ఆర్చ్‌ల పరిమాణాన్ని పెంచాల్సి వచ్చింది.

ఇంజిన్లను చల్లబరచడానికి సాధారణ కూలింగ్ ఇన్‌లెట్‌లకు బదులుగా మంచుతో కూడిన రెండు ట్యాంకులను ఉపయోగించారు. ఒక్కో రన్‌కు ఏకంగా 250 కిలోల మంచు అవసరం.

రికార్డు స్థాయి రన్‌లో Hydromax కేవలం 2 కిలోల కంటే కొంచెం ఎక్కువ హైడ్రోజన్‌ను మాత్రమే వినియోగించిందని JCB తెలిపింది. దీనివల్ల సుమారు 18 లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుంది.

ఆండీ గ్రీన్‌కు మూడో ప్రపంచ రికార్డుHydromaxను నడిపిన ఆండీ గ్రీన్‌కు ఇది మూడో ప్రపంచ రికార్డు. 1997లో ధ్వని వేగాన్ని దాటిన Thrust SSCతో ప్రపంచ ల్యాండ్ స్పీడ్ రికార్డును సాధించాడు. ఆ తర్వాత 2006లో JCB Dieselmaxతో డీజిల్ కారుకు సంబంధించిన ప్రపంచ వేగ రికార్డును నెలకొల్పాడు.

ఇప్పుడు JCB Hydromaxతో హైడ్రోజన్ కంబన్షన్‌ ఇంజిన్‌ వెహికల్‌తో మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.