Mahindra Changed New Electric SUV Name: మహీంద్రా ఇటీవల మనదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఈ 6ఈని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ పేరును బీఈ 6గా మార్చారు. డిసెంబర్ 3వ తేదీన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థ 6ఈ అనే పేరును ఉపయోగించడంపై ఢిల్లీ హైకోర్టులో మహీంద్రాపై కేసు వేసింది. ఎందుకంటే 6ఈ అనేది ఆ సంస్థకు సంబంధించిన ట్రేడ్ మార్క్. ఆ పేరును కారుకు పెట్టడంపై ఇంటర్‌గ్లోబ్ కోర్టుకు వెళ్లింది. ఇండిగో మాతృ సంస్థే ఈ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్. అయితే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌పై న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని మహీంద్రా తెలిపింది. ఈ కేసు డిసెంబర్ 9వ తేదీన విచారణకు రానుంది.
మహీంద్రా ఏం అంటోంది?
మహీంద్రా తన కారు పేరు బీఈ 6ఈ అని పేర్కొంది. ఇది కేవలం 6ఈ కాదు. ఇండిగో ట్రేడ్‌మార్క్ నుంచి ఇది పూర్తిగా భిన్నమైనది. తాము లాంచ్ చేసిన ప్రొడక్ట్, డిజైన్‌కు విమానయాన రంగానికి ఏమాత్రం సంబంధం లేదని కంపెనీ తెలిపింది. దీని వల్ల ఎలాంటి గందరగోళానికి కూడా అవకాశం లేదు.
Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
ఇండిగో ఎందుకు అభ్యంతరం చెప్పింది?
మరోవైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ గత 18 సంవత్సరాలుగా 6ఈ తమ గుర్తింపులో అంతర్భాగంగా ఉందని, ఇది ఒక రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ అని పేర్కొంది. దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఏ రూపంలోనైనా 6ఈని అనధికారికంగా ఉపయోగించడం తమ బ్రాండ్ గుర్తింపును ఉల్లంఘించడమేనని కంపెనీ అంటోంది. దీన్ని కాపాడుకోవడానికి తాము సాధ్యమైన ప్రతి చర్యను తీసుకుంటామని పేర్కొంది.
మరోవైపు మహీంద్రా ఈ విషయంపై విచారం కూడా వ్యక్తం చేసింది. రెండు పెద్ద కంపెనీలు ఇలాంటి అనవసరమైన వివాదాలలో చిక్కుకోవద్దని పేర్కొంది. అలాగే ఈ ఉత్పత్తి పేరును బీఈ 6ఈ నుంచి బీఈ 6గా మారుస్తున్నట్లు ప్రకటించింది. అలాగే దీనిపై న్యాయ పోరాటం మాత్రం ఆపబోమని తెలిపింది. కొన్ని రోజుల క్రితమే మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మనదేశంలో లాంచ్ అయింది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీలతో ఈ కారు పోటీ పడనుంది.
Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!