మీరు కొత్త ఎలక్ట్రిక్ SUVని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ జూలై 2026లో మంచి ఆఫర్లు ఉన్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన పాపులర్ ఎలక్ట్రిక్ Mahindra SUV BE 6పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ, కస్టమర్లను తమ వైపు ఆకర్షించడానికి, కంపెనీ ఈ మోడల్‌పై ఏకంగా రూ. 2.50 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. చాలా కాలంగా ఈ ఎలక్ట్రిక్ SUVని కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఈ ఆఫర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Continues below advertisement

హైదరాబాద్‌లో ఎస్‌యూవీ ధర ఎంతంటే..

ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ తో పాటు ఇతర ఆఫర్లు ఉంటాయని మహీంద్రా కంపెనీ పేర్కొంది. అయితే, వినియోగదారులు అందరికీ ఒకే రకం ఆఫర్ లభించదు. మీరు ఏ వేరియంట్‌ను కొనుగోలు చేస్తున్నారనే దానిపై ప్రత్యేకమైన ఆఫర్ ఉంటుంది. ముఖ్యంగా 2025 ఇయర్ మోడల్ (MY2025) యూనిట్లపై అత్యధిక ప్రయోజనం లభించనుంది. అందువల్ల కార్ కొనే ముందు మీకు దగ్గర్లోని మహీంద్రా షోరూమ్‌ను సందర్శించి ఆఫర్ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.18,90,001 కాగా,  ఆన్ రోడ్ ధర రూ. 20,48,680 తో ప్రారంభం అవుతుంది. 

Continues below advertisement

EV డిజై, ఇంటీరియర్ ఎలా ఉంది? కంపెనీ కొత్త జనరేషన్ INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన SUV Mahindra BE 6. దీని డిజైన్ సాధారణ SUVల కంటే పూర్తిగా భిన్నంగా, చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ముందు భాగంలో ఆకర్షణీయమైన LED లైట్ బార్, షార్ప్ హెడ్‌లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమిక్ బాడీ, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ రోడ్డుపై ఈ వాహనాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి.  మోడ్రన్ డిజైన్‌తో పాటు కొత్త టెక్నాలజీ కారును కోరుకునే కస్టమర్లకు ఈ SUV బాగా నచ్చుతుంది. 

Also Read: హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?

ఇంటీరియర్ విషయానికి వస్తే, మహీంద్రా BE 6 క్యాబిన్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. ఇందులో పెద్ద డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఇచ్చారు. ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం,  మరొకటి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కోసం ఉంటుంది. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సౌకర్యాల ఉండటంతో ఈ SUV ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది.

కారు సేఫ్టీ, పర్ఫార్మెన్స్

సేఫ్టీ విషయానికి వస్తే Mahindra BE 6 చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో పలు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా,  లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. ADAS కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి లాంగ్ జర్నీని, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

Also Read: 526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి

Mahindra BE 6లో విభిన్న బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని మహీంద్రా కంపెనీ పేర్కొంది. చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రేంజ్ కూడా దాదాపు 550 కిలోమీటర్లు ఉందని క్లెయిమ్ చేసింది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దాంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేయడం వీలవుతుంది. లాంగ్ జర్నీ చేసేవారికి, ఫ్యామిలీతో పాటు వెళ్లే వారికి ఈ ఎస్‌యూవీ జర్నీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.