Mahindra Electric SUVs BE 6e and XEV 9e: కార్ల తయారీదారు మహీంద్రా త్వరలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రెండింటినీ కంపెనీ వివిధ విభాగాలలో పరిచయం చేయనుంది. దీని కోసం కంపెనీ టీజర్‌ను కూడా విడుదల చేసింది. కంపెనీ లాంచ్ చేయనున్న రెండు ఎస్‌యూవీలు మహీంద్రా బీఈ 6ఈ (Mahindra BE 6e), మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9e). మీరు ఈ రెండు ఎస్‌యూవీల్లో మీరు అనేక గొప్ప ఫీచర్లను పొందుతారు. ఇందులో ఎల్ఈడీ లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఏరో స్టైల్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.


మహీంద్రా బీఈ 6ఈ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ రెండు ఎస్‌యూవీలు పెద్ద బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంటాయి. దీంతో పాటు రెండింటిలో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయని కూడా తెలిపారు. రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను 2024 నవంబర్ 26వ తేదీన చెన్నైలో జరగనున్న 'అన్‌లిమిట్ ఇండియా' ఈవెంట్‌లో వరల్డ్ ప్రీమియర్ సమయంలో పరిచయం చేయనున్నారు. 



Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!


ఇది ఏ కార్లతో పోటీపడుతుంది?
మహీంద్రా బీఈ 6ఈని విడుదల చేయనుంది. ఇది టాటా కర్వ్, విండ్సర్, జెడ్ఎస్ ఈవీతో నేరుగా పోటీపడుతుంది. ప్రస్తుతానికి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మాత్రమే ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కాకుండా, ఈ రెండు ఎస్‌యూవీలు త్వరలో లాంచ్ కానున్నాయి. రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు సంబంధించిన ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైట్లు, ట్రిపుల్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు.


మహీంద్రా ప్రవేశపెట్టిన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ... ఎక్స్ఈవీ 9ఈ. ఇది ప్రీమియం, విలాసవంతమైన రూపంతో వచ్చే ఒక లగ్జరీ ఎస్‌యూవీ. అయితే బీఈ 6ఈ దాని బోల్డ్, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్‌కు మంచి పేరు పొందింది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.



Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!