Lotus Eletre SUV Launch: బ్రిటీష్ ఆటోమొబైల్ తయారీదారు లోటస్ కార్స్ అధికారికంగా లోటస్ ఎలెట్రి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Lotus Eletre SUV) లాంచ్‌తో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. లోటస్ ఇప్పుడు చైనీస్ బ్రాండ్ గీలీ ఆటోమోటివ్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఇది వోల్వో, పోలెస్టార్, జీకర్, స్మార్ట్, లివాన్‌తో సహా అనేక ఇతర ఆటోమోటివ్ బ్రాండ్‌లను కలిగి ఉంది. భారతదేశంలో విక్రయాలు, సేవలను నిర్వహించడానికి కంపెనీ న్యూఢిల్లీకి చెందిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ భారతదేశంలో బెంట్లీ మోటార్స్ కార్లను కూడా విక్రయిస్తుంది.


పూర్తిగా ఇంపోర్ట్ ద్వారానే...
లోటస్ ఎలెట్రి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మూడు వేర్వేరు ట్రిమ్‌లలో మనదేశంలో లాంచ్ అయింది. అదే స్టాండర్డ్, ఎలెట్రి ఎస్, ఎలెట్రి ఆర్. ఈ ఎస్‌యూవీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హెథెల్‌లో ఉన్న కంపెనీ ఫెసిలిటీలో తయారు కానుంది. అక్కడి నుంచి భారతదేశానికి దిగుమతి అవుతుంది.


లోటస్ ఎలెట్రి కొలతలు, ధర (Lotus Eletre SUV Price)
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పొడవు 5103 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 2231 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1630 మిల్లీమీటర్లుగానూ ఉంది. దీని వీల్‌బేస్ 3019 మిల్లీమీటర్లుగా ఉంది. భారతదేశంలో లోటస్ ఎలెట్రె ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.55 కోట్లుగా నిర్ణయించారు.


లోటస్ ఎలెట్రి ఇంజిన్ ఇలా... (Lotus Eletre SUV Engine)
ఎలెట్రి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లోటస్ ఎలక్ట్రిక్ ప్రీమియం ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఒకే ప్లాట్‌ఫారమ్ విభిన్న బ్యాటరీ పరిమాణాలు, ఎలక్ట్రిక్ మోటార్‌లతో ఎక్కువ కార్ విభాగాలకు అనుకూలంగా ఉంటుందని లోటస్ చెబుతోంది. ఎలెట్రి, ఎలెట్రి ఎస్‌లు 112 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి. ఇవి డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో 603 హెచ్‌పీ పవర్‌ని ఎలక్ట్రిక్ మోటార్‌తో ఉత్పత్తి చేస్తాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 600 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఈ కార్లు అందించనున్నాయి.


ఎలెట్రి ఆర్ కూడా 112kWh బ్యాటరీ ప్యాక్‌నే కలిగి ఉంది. అయితే ఈ వేరియంట్‌లో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌లను అందించారు. ఈ జంట మోటార్లు 2-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 905 హెచ్‌పీ పవర్, 985 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలెట్రి ఆర్ కారు మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. ఇది కేవలం 2.95 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మూడు వేరియంట్‌లు ఆల్ వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ కూడా ప్రామాణికంగా ఉంటుంది. రాపిడ్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లోనే  10 నుంచి 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని, ఇది ప్రామాణిక 22 కేడబ్ల్యూహెచ్ ఏసీ ఛార్జర్‌తో వస్తుందని లోటస్ తెలిపింది.


లోటస్ ఎలెట్రి ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపలి భాగంలో 12 జీబీ ర్యామ్ ఉన్న ఫోల్డబుల్ 15.1 అంగుళాల ల్యాండ్‌స్కేప్ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది 5జీ కనెక్టివిటీ, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 12.6 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇంటెలిజెంట్ వాయిస్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 23 స్పీకర్ 2160W సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంతేకాకుండా ఇది లిడార్‌తో ఏడీఏఎస్, ఆరు రాడార్లు, ఏడు 8 మెగాపిక్సెల్ హెచ్‌డీ కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్‌లను కలిగి ఉంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!