త్వరలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనానికి సంబంధించిన రియల్ లైఫ్ వెర్షన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువస్తామని ఎల్జీ ప్రకటించింది. భవిష్యత్తులో ఈ కార్లదే రాజ్యమని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఎల్జీ ఈ రంగంలోకి ముందుగానే అడుగు పెడుతోంది.
దక్షిణ సియోల్‌లో ఫిబ్రవరి 10వ తేదీన ఎల్జీ ఓమ్నీపాడ్ అనే కొత్త కాన్సెప్ట్‌ను కూడా పరిచయం చేయనుంది. దీన్ని హోం ఆఫీస్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌గా, లాంజ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చని ఎల్జీ అంటోంది. దక్షిణ సియోల్‌లో ఫిబ్రవరి 10వ తేదీన జరగనున్న మొబిలిటీ ఫెయిర్‌లో ఇది వినియోగదారుల ముందుకు రానుంది.
ఎల్జీ సృష్టించిన వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ రియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సేవలను కూడా అందించనుంది. ఎల్జీ సెల్ఫ్ డ్రైవింగ్ హోం ఆన్ వీల్స్ దీని ఆధారంగానే పనిచేయనుంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇందులో మెటావర్స్ డిస్‌ప్లే సిస్టం ద్వారా రియల్ టైంలో అడాప్టివ్ ఇంటీరియర్‌ను అందించవచ్చని కంపెనీ అంటోంది. కదులుతున్న కారులో ఇంటినే తలపించేలా అన్ని రకాల మోడ్స్‌ను ఇందులో అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో అటానమస్, స్మార్ట్ వాహనాలను రూపొందించడానికి కంపెనీ విజన్‌కు తగ్గట్లుగా ఈ ఓమ్నీపాడ్‌ను రూపొందిస్తున్నట్లు ఎల్జీ తెలిపింది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?