భారతీయ టూవీలర్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లు పెద్ద సంఖ్యలో అడుగు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు తోడు, వినియోగదారుల్లో పొల్యూషన్ ఫ్రీ వాహనాల పట్ల అవగాహన పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్ని ప్రమాదాలు కస్టమర్లను కలవరపెడుతున్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. అలాంటివారి కోసం కోమాకి అగ్ని ప్రమాదాలకు అవకాశంలేని ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. 


తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమాకి (Komaki) భారత్ మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కోమాకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) పేరుతో కంపెనీ ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూటర్ ఇప్పటికే భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న వెనిస్ ఎకో వెనిస్ యొక్క టోన్ డౌన్ వెర్షన్‌ గా ఉంటుంది. అంటే, టాప్ ఎండ్ వేరియంట్‍‌కు దిగువన ఎంట్రీ లెవల్ వేరియంట్‌ గా ఉంటుంది.  భారత మార్కెట్లో వెనిస్ ఎకో వెనిస్ ఎకే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,000 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ఫిక్స్ చేసింది.


వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్ తో 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో లిథియం అయాన్ బ్యాటరీ స్థానంలో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు.  ఇది సాధారణ బ్యాటరీతో పోల్చితే తక్కువ హీట్ ను జెనరేట్ చేస్తుంది. ఈ కారణంగా వాహనంలో మంటలు చెలరేగే అవకాశం ఉండదు. అంతేకాదు.. ఈ బ్యాటరీ పైర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్ అయ్యేందుకు సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 


ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  ట్రెడిషనల్ స్కూటర్ లుక్ ను కలిగి ఉంటుంది.  ఒరిజినల్ కోమాకి వెనిస్‌ తో పోల్చితే  వెనిస్ ఎకో చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది  స్టోరేజ్ బాక్స్‌ ను కలిగి ఉండదు.  మెటల్ ఫ్రేమ్‌ కూడా తొలగించబడుతుంది.  వీటి స్థానంలో  బ్యాక్‌ రెస్ట్ లు ఉంటాయి. ఈ లేటెస్ట్ స్కూటర్  గార్నెట్ రెడ్, శాక్రమెంటో గ్రీన్, జెట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, బ్రైట్ ఆరెంజ్, సిల్వర్ క్రోమ్ అనే ఏడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్‌ లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మ్యాప్‌లను నావిగేట్ చేయంలో ఉపయోగపడుతుంది.  ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ గానూ పనిచేస్తుంది.  ఇందులో  మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. కొత్త  వెనిస్ ఎకో.. వెనిస్ మాదిరిగా రెండు సీట్ల డిజైన్‌ కాకుండా సింగిల్ సీట్ డిజైన్ ను కలిగి ఉంటుంది.  హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.  


కోమాకి  దేశీయ మార్కెట్ లో 16 రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పాటు 2 ఎలక్ట్రిక్ త్రీవీలర్లను అమ్ముతున్నది. ఈ కంపెనీ అందిస్తున్న  ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ రేంజర్ చాలా ప్రత్యేకమైన ఇ బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క ఛార్జ్ తో దాదాపు 250 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. 


Also Read: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?


Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?