Upcoming Kia Cars: ఈ నెల ప్రారంభంలో తన ఉత్పత్తులకు అనేక అప్‌డేట్లు ప్రకటించిన తర్వాత, కియా ఇప్పుడు అనేక ఇతర రాబోయే మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ ఈ ఏడాది చివర్లో రెండు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది.


రాబోయే రెండు కొత్త మోడళ్లలో కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, కొత్త తరం కియా కార్నివాల్ ఉండనున్నాయి. ఈ రెండు కార్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయనున్నారు. వీటిలో కియా కార్నివాల్ ముందు మార్కెట్లోకి రానుందని అంచనా. అయితే కియా ఈవీ9 ఆ తర్వాత లాంచ్ కావచ్చు.


టెస్టింగ్ షురూ
కియా రెండు కార్లను పరీక్షించడం ప్రారంభించింది. రెండు నెలల క్రితం ఈవీ9 రోడ్లపై కనిపించింది. భారతీయ మార్కెట్లో బ్రాండ్ కొత్త ఫ్లాగ్‌షిప్ కారుగా ఇది సెట్ కానుంది. ఇది 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ మోడల్స్‌లో లాంచ్ కానుందని అంచనా. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని అంచనా.


ఈవీ9 ఎలా ఉంటుంది?
ఇండియా స్పెక్ ఈవీ9 గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ కారు మొదట్లో సీబీయూ మోడల్‌గా వస్తుందని, డిమాండ్‌ను బట్టి సీకేడీ వెర్షన్‌లో తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రెండో వరుసలో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.


వేటితో పోటీ పడతారు?
కియా ఈవీ9 భారతీయ మార్కెట్లో జీప్ గ్రాండ్ చెరోకీ, త్వరలో రాబోయే వోల్వో ఈఎక్స్90 వంటి కార్లతో పోటీపడుతుంది. వోల్వో ఈఎక్స్90 ఈ సంవత్సరం జూన్‌లో మార్కెట్లో లాంచ్ కానుందని అంచనా. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 1.50 కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!