Kia Syros Long Term Review: కొత్త కాంపాక్ట్ SUV కియా సైరోస్‌, లాంచ్‌ మొదటి రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రివ్యూ కోసం సెలెక్ట్‌ చేసుకున్న వేరియంట్ HTX Plus (O) 1.0 లీటర్ టర్బో పెట్రోల్ DCT. పేపర్‌పై చూసినా, ప్రాక్టికల్‌గా నడిపినా, ఈ వేరియంట్‌లో స్టైల్‌తో పాటు డైలీ యూజ్‌ఫుల్ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి.

Continues below advertisement

డిజైన్ - మొదట ఆశ్చర్యంగా, తర్వాత ఇష్టంగా మారే స్టైల్కియా సైరోస్‌ను మొదట చూసినప్పుడు బాక్సీ లుక్స్ కొంచెం ఆశ్చర్యంగా అనిపించాయి. లైన్స్ కూడా ఏదోలా కనిపిస్తాయి. కానీ రోజులు గడుస్తుంటే ఈ డిజైన్‌లో ఉన్న ప్రత్యేకత గమనించగలిగాం. స్క్వేర్‌డ్-ఆఫ్ ప్రోపోర్షన్స్, స్ట్రెయిట్ లైన్స్ ఈ కార్‌కు ఒక ప్రత్యేక క్యారెక్టర్ ఇస్తాయి. మార్కెట్‌లో ఉన్న సాఫ్ట్ ఎడ్జ్ SUVలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.

క్యాబిన్ స్పేస్ - బయటకు చిన్నగా, లోపల పెద్దగాసైరోస్ బయట నుంచి చూస్తే ఏమంత పెద్దగా కనిపించదు, కానీ లోపలికి అడుగుపెట్టగానే స్పేస్ నిజంగా ఆకట్టుకుంటుంది. డాష్‌బోర్డ్ లేఔట్ చాలా సింపుల్‌గా, క్లియర్‌గా ఉంది. కియా ఇచ్చిన ఫిజికల్ బటన్స్ రోజువారీ వాడకంలో చాలా ఉపయోగకరంగా అనిపించాయి.

Continues below advertisement

వైర్‌లెస్ ఛార్జింగ్ ట్రే పొజిషన్‌ కూడా అద్భుతం. ఫోన్ బంప్స్‌లో కదలకుండా ఉండేలా మంచి గ్రిప్ ఇచ్చారు. డ్యూయల్ స్క్రీన్ సెటప్ ప్రీమియంగా కనిపిస్తుంది; గ్రాఫిక్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి.

కప్ హోల్డర్స్ రీసైజ్ అయ్యే విధానం కూడా చాలా మందికి నచ్చింది. ఇంటీరియర్ లైట్ గ్రే థీమ్ క్యాబిన్‌ను మరింత ఓపెన్‌గా మారుస్తుంది.

రియర్ సీటింగ్ - కుటుంబ ప్రయాణాలకు పర్ఫెక్ట్HTX Plus (O) వేరియంట్‌లో ఇచ్చిన వెంటిలేటెడ్ సీట్స్ పెద్ద హైలైట్, ఇవి ముందు మాత్రమే కాకుండా వెనుక వైపు కూడా ఉంటాయి (బేస్ సీటు వెర్షన్‌లో మాత్రమే). రియర్ సీటు కంఫర్ట్‌పై కుటుంబ సభ్యులు, ఆఫీస్ సహచరులు కూడా బాగానే ఇంప్రెస్ అయ్యారు. లెగ్‌రూమ్ సరిపోతుంది, బ్యాక్‌రెస్ట్‌ను రీక్లైన్ చేయొచ్చు, వెనుక ప్రయాణం చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది.

పనోరమిక్ సన్‌రూఫ్ తెరిచిన వెంటనే క్యాబిన్ పూర్తిగా ఓపెన్ అయిన అనుభూతిని ఇస్తుంది. ఈ క్లాస్‌లో ఇలా అనిపించే కార్లు చాలా తక్కువ.

రైడ్ క్వాలిటీ - కొంచెం మారాలి, కానీ కంట్రోల్ బాగుందిసైరస్ రైడ్ క్వాలిటీ కొంచం మారితే బాగుండేది. మంచి రోడ్డుపై చాలా స్థిరంగా ఉంటుంది, కానీ పెద్ద గుంతలు & షార్ప్ ఎడ్జ్‌లను క్రాస్ చేస్తున్నప్పుడు క్యాబిన్‌లోకి కొంచెం జర్క్‌లు వస్తాయి. అయితే ఇవి అసౌకర్యం కలిగించేంత ఉండవు, కానీ స్పీడ్ తగ్గించడం అవసరం.

NVH లెవల్స్ కూడా కొంచెం మెరుగుపరచాలి. హైవే స్పీడ్‌లో విండ్ నాయిస్, టైర్ నాయిస్, కొన్నిసార్లు ఇంజిన్ శబ్దం కూడా వినిపిస్తుంది. కాంపిటీటర్స్‌లో కొన్ని మోడల్స్ ఈ శబ్ధాలను ఇంకా బెటర్‌గా కంట్రోల్ చేస్తున్నాయి.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్ - సిటీకి సరైన కాంబినేషన్1.0L టర్బో పెట్రోల్ ఇంజిన్ పవర్‌ఫుల్‌ కాకపోయినా, సిటీ రైడ్స్‌కు చాలినంత పంచ్ ఇస్తుంది. 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా షిఫ్ట్ అవుతుంది. ట్రాఫిక్‌లో కూడా పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా పని చేస్తుంది. డ్రైవింగ్ అనుభవం పూర్తిగా ప్రాక్టికల్, డైలీ కమ్యూట్‌కు పర్ఫెక్ట్.

ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ - ప్రస్తుతం 9-10 kmplసిటీ, మిక్స్‌డ్ ట్రాఫిక్‌లో ప్రస్తుతం వస్తున్న మైలేజ్ 9-10 kmpl మధ్యే ఉంది. హైవే రన్స్ తర్వాత మరింత క్లియర్ ఫిగర్ చెప్పగలుగుతాం. ఇప్పటివరకు, కియా సైరోస్ రోజువారీ ఆఫీస్ ట్రిప్స్‌, చిన్నపాటి దూరాలకు చాలా లైట్‌, ఈజీ, కంఫర్టబుల్‌గా ఉంది. ఇంకా, హైవే ట్రిప్‌లో ఎలా ఉంటుందో తర్వాతి రిపోర్ట్‌లో వివరిస్తాం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.