Chinni Serial Today Episode లోహిత వరుణతో మీ అమ్మ, అత్తయ్య ఎవరూ నాతో సరిగా మాట్లాడటం లేదు.. అని అంటుంది. ఏం కాదులే లోహి నాలుగు రోజులు తర్వాత మాట్లాడుతారులే అని అంటాడు. అసలు ఇదంతా మధు వల్లే మనకు మధు పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోకుండా ఉండాల్సింది.. పెద్దలు ఒప్పుకుంటేనే చేసుకుంటాం అని పట్టు పట్టాల్సింది.. ఇదంతా జరిగేది కాదు అని అంటుంది. 

Continues below advertisement

వరుణ్‌ లోహితతో అలా అంటావేంటి లోహి.. మధు, మ్యాడీ బావ సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈ జన్మకి మన పెళ్లి అయ్యేది కాదు అని అంటాడు. నాగవల్లి ఆంటీ కోపం తగ్గితే బాగున్ను అని లోహిత అంటుంది. ఇక మహి రావడం చూసిన వరుణ్ బావ ఎక్కడికి వెళ్లావా అంటే నేను మధు చిన్ని కోసం వెతికాం అని చెప్తాడు. మొత్తం వెతికినా చిన్ని వివరాలు తెలీలేదు అని చెప్తాడు. మహి చాలా బాధపడతాడు. వరుణ్ మ్యాడీతో తప్పకుండా చిన్ని నీకు కలుస్తుంది అని అంటాడు. మ్యాడీ క్యాలెండర్ చూసి చిన్ని ఇంకో 20 రోజుల్లో నాకు కలవాలి.. లేదంటే చిన్నికి నేను శాశ్వతంగా దూరం అయిపోతా అని అనుకుంటాడు. 

లోహితకు సరళ కాల్ చేసి రేపు ఎన్ని గంటలకు వస్తావ్.. రేపు మీ నాన్న ఆబ్దికం అని అంటుంది. లోహిత రావాలా వద్దా అని అనుకుంటున్నా అని అంటే ఏంటే నువ్వు ఆలోచించేది.. మీ నాన్న ఆబ్దికమే రేపు నువ్వు రావాలి,, లేదంటే మీ నాన్నతో పాటు నేను చనిపోయా అని అనుకో అంటుంది. 

Continues below advertisement

సత్యంబాబు ఆబ్దికానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. చందు తండ్రి ఫోటో చూసి దిగులుగా ఉంటాడు. చిన్నతనం గుర్తు చేసుకుంటాడు. సరళ కొడుకుతో లోహితకు కాల్ చేయరా అంటే వద్దమ్మా నువ్వు చేసినా రాలేదు కదా అంటాడు. పంతులు పూజ మొదలు పెడదామని అంటే సరళ పది నిమిషాలు ఆగమని అంటుంది. చందు కోపంగా చూస్తాడు. ఒక్క పది నిమిషాలు ఆగుదాంరా అని అంటుంది. 

లోహిత బయటకు వెళ్తుంటే దేవా చూసి అడుగుతాడు. నాగవల్లి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. మా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నా అంటుంది. ఎవరికి చెప్పి వెళ్తున్నావ్,, వరుణ్‌కి చెప్పావా.. వసంతకి చెప్పావా.. నాకు చెప్పావా అని ఇదేనా మీ అమ్మ నేర్పిన సంస్కారం అని అడుగుతుంది. ఇక దేవా నాగవల్లిని వదిలేయ్ అని చెప్పి మీ నాన్న వాళ్లని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పమ్మా అని దేవా అంటాడు. మీ వాళ్లు ఏం బిజినెస్ చేస్తారు అని అడుగుతాడు. దానికి లోహిత ఒకటా రెండా మాకు చాలా బిజినెస్‌లు ఉన్నాయి.. దేశ దేశాలు తిరుగుతూ ఉంటారు అని అంటుంది. మెయిన్ బిజినెస్ ఏంటి అని అడిగితే టీ పొడి బిజినెస్ అని చెప్తుంది. దేవా తన లోహిత తండ్రి పేరు అడగగానే కుక్కుటేశ్వరరావు అని అంటుంది. లోహిత అదీ ఇదీ అని చెప్పి ఫ్రెండ్ ఇంటికి అని వెళ్లిపోతుంది. 

మ్యాడీ బయటకు వెళ్తుంటే దేవా ఆపుతాడు. ఎలా అయినా వీడిని వెళ్లనివ్వకూడదు అని మ్యాడీని ఇంట్లోనే ఉండమని ఆలయం సీసీ టీవీ ఫుటేజ్ తెప్పిస్తున్నా ఆ రోజు నిమ్మకాయ దీపం పెట్టింది ఎవరో తెలుస్తుంది అని అంటాడు. మనసులో మాత్రం ఇక వీడిని వెళ్లనివ్వకూడదు అని అనుకుంటాడు. 

మధు చందు వాళ్ల ఇంటికి వెళ్తుంటుంది. ఇక చందు ఆబ్దికం మొదలు పెట్టమని.. చిన్ని మన ఇంటికి వచ్చేలా ఆశీర్వదించునాన్న అని కోరుకుంటాడు. లోహిత ఇలా తయారవడానికి నేనే కారణం అని సరళ బాధ పడుతుంది. మధు చందు వాళ్ల ఇంటికి వస్తుంది. శేఖర్ అంటే ఈ మాస్టారా ఈయన మా స్కూల్‌లోనే చదువుకున్నారా అని అనుకుంటుంది. 

చందు మధుని చూసి లోపలికి పిలుస్తాడు. ఈ రోజు మా నాన్న గారి ఆబ్దికం అని పిలుస్తాడు. ఇక మధు లోపలికి వచ్చి తన మేనమామ సత్యంబాబు ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. చందుని చూసి తనే తన చిన్ననాటి చందునా అని అనుకుంటుంది. సరళని చూసి అత్తయ్యా.. అంటే ఇది నా మామయ్య ఇళ్లా అని ఎమోషనల్ అయిపోతుంది. సరళ కూడా మధుని చూసి ఈ అమ్మాయి ఎవర్రా అని అడిగితే మా కాలేజ్‌లో చదువుతుందమ్మా నాతో ఏదో పని ఉండి వచ్చింది అని అంటాడు. మధు సరళకు నమస్కారం పెట్టి అలా చూస్తూ ఉండటం చూసి ఏమైంది అని సరళ అంటుంది. సరళ మధుని కూడా ఆబ్దకం దగ్గర కూర్చొమని అంటుంది. ఇక మ్యాడీ తండ్రితో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.