Kia Syros EV Price, Range And Features: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, కియా తన కొత్త సైరోస్ EVను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ నెలాఖరులో ఈ ఎలక్ట్రిక్ SUVను మార్కెట్లో విడుదల చేయనున్న కంపెనీ, ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్‌ ప్రారంభించింది. కొత్త సైరోస్ EVలో అత్యాధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్ & శక్తివంతమైన పనితీరు అందించడం ద్వారా ఈ సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇవ్వాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.

Continues below advertisement

కియా సైరోస్ EVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు - 42kWh & 51.4kWh - ఉన్నాయి. ఇవే బ్యాటరీ ప్యాక్‌లు కియా కారెన్స్ క్లావిస్ EV & హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో కూడా ఉన్నాయి. అయితే సైరోస్ EV పరిమాణం తక్కువగా ఉండటంతో బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు.

51.4kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 42kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్‌కు 443 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉందట. ఈ రేంజ్‌తో ఈ SUV తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ స్థానంలో నిలుస్తుందని కియా చెబుతోంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల

పెద్ద బ్యాటరీ (51.4kWh) వేరియంట్‌లో ముందు చక్రాలకు 171hp శక్తి & 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. చిన్న బ్యాటరీ (42kWh) వేరియంట్‌లో 135hp శక్తి & 255Nm టార్క్ లభిస్తుంది. 51.4kWh వేరియంట్ కేవలం 8.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. పనితీరు పరంగా టాటా నెక్సాన్ EV & మహీంద్రా XUV 3XO EV కంటే ఇది మరింత శక్తివంతంగా ఉండనుంది.

ఛార్జింగ్‌7.4kW లేదా 11kW AC ఛార్జర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 7.4kW AC ఛార్జర్‌తో 42kWh బ్యాటరీని 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది. 51.4kWh బ్యాటరీకి 7 గంటల 15 నిమిషాల సమయం అవసరం. 

100kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే పెద్ద బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లో 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: రూ.12.99 లక్షలకే అడ్వెంచర్ SUV - ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసిన రెనాల్ట్‌

కియా సైరోస్ ఎలక్ట్రిక్ SUVని HTK, HTK+, HTX, HTX+ & X-Line అనే ఐదు వేరియంట్లలో విక్రయించనున్నారు. చిన్న బ్యాటరీ ప్యాక్ మొదటి మూడు వేరియంట్లలో లభిస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్.. బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే EV డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. వెనుక భాగంలో ఉండే ఫ్యూయల్ ఫిల్లర్ స్థానంలో, ముందు వైపు ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైటింగ్ సిగ్నేచర్, బంపర్ డిజైన్ & బాడీ క్లాడింగ్ కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ SUV అందుబాటులోకి రానుండగా X-Line వేరియంట్‌కు ప్రత్యేక రంగులు కూడా ఉన్నాయి.

ఫీచర్లుక్యాబిన్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ & 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, వైర్‌లెస్ ఛార్జింగ్, 8 స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ అంబియంట్ లైటింగ్, పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్లైడింగ్ & రీక్లైనింగ్ వెంటిలేటెడ్ రియర్ సీట్లు, డ్యూయల్ కెమెరా డ్యాష్‌క్యామ్, 16 లీటర్ల ఫ్రంక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భద్రత పరంగా కూడా కియా ఎలాంటి రాజీ పడలేదు. Level 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను అందించింది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్‌షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. తెలుగు రష్ట్రాల్లో అంచనా ఆన్‌రోడ్ ధర రూ.15.90 లక్షల నుంచి రూ.19.61 లక్షల మధ్య ఉండొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.