Most selling cars in H1 2026: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జనవరి నుంచి జూన్ వరకు జరిగిన అమ్మకాల వివరాల ప్రకారం, మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ కాలంలో మొత్తం 1,26,204 యూనిట్లు విక్రయించగా, టాప్ 15 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి ఏకంగా 9 మోడళ్లతో తన బలాన్ని మరోసారి నిరూపించింది.

Continues below advertisement

అమ్మకాల జాబితాలో తొలి స్థానంలో మారుతి సుజుకి డిజైర్ నిలబడితే, రెండో స్థానాన్ని టాటా పంచ్ 1,19,303 యూనిట్లతో దక్కించుకుంది. టాటా నెక్సాన్ 1,18,166 యూనిట్లతో మూడో స్థానంలో ఆగింది. ఈ మూడు మోడళ్ల మధ్య అమ్మకాల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో తీవ్ర పోటీని సూచిస్తోంది.

మారుతి ఎర్టిగా 1,08,295 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో మారుతి వాగన్ ఆర్ 1,00,704 యూనిట్ల అమ్మకాలతో చోటు దక్కించుకుంది. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నప్పటికీ ఈ రెండు మోడళ్లు లక్షకు పైగా అమ్మకాలు నమోదు చేయడం విశేషం.

Continues below advertisement

ఇది కూడా చదవండి: హేమ గ్యారేజ్‌లో బెంజ్ జీఎల్ఎస్ 450D... కారు ఫీచర్స్ తెలుసా? రేటు కోటిన్నర కంటే ఎక్కువ

ఆరో స్థానంలో మారుతి స్విఫ్ట్ 97,747 యూనిట్లు, ఏడో స్థానంలో మారుతి బలెనో 96,996 యూనిట్లు, ఎనిమిదో స్థానంలో మారుతి ఫ్రాంక్స్ 95,441 యూనిట్లతో నిలిచాయి. దీంతో.. 4 నుంచి 8 వరకు వరుసగా ఐదు ర్యాంకులను మారుతి మోడళ్లు కైవసం చేసుకున్నాయి.

హ్యుందాయ్ క్రెటా 91,391 యూనిట్లతో మొత్తం జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మాత్రం అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. పెరుగుతున్న పోటీ మధ్య కూడా క్రెటా తన స్థానం నిలబెట్టుకోవడం విశేషం.

మహీంద్రా స్కార్పియో 89,375 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. ఈ గణాంకాల్లో స్కార్పియో ఎన్ & స్కార్పియో క్లాసిక్ రెండు మోడళ్ల అమ్మకాలు ఉన్నాయి. మారుతి బ్రెజ్జా 88,967 యూనిట్లతో 11వ స్థానంలో నిలిచింది. ఈ నెలలో ఫేస్‌లిఫ్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బ్రెజ్జా మంచి అమ్మకాలను నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: రూ.73,850 నుంచే హీరో విడా VX2 - ఏ వేరియంట్ కొనాలి? ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు

12వ స్థానంలో, కొత్తగా వచ్చిన మారుతి విక్టోరిస్ 73,912 యూనిట్లతో ఆకట్టుకుంది. 13వ స్థానాన్ని మారుతి ఈకో 71,424 యూనిట్లతో దక్కించుకుంది. వ్యాన్ విభాగానికి చెందిన మోడల్ అయినప్పటికీ ఈకో సాధించిన అమ్మకాలు మారుతి ఆధిపత్యాన్ని సూచిస్తాయి.

హ్యుందాయ్ వెన్యూ 68,964 యూనిట్లతో 14వ స్థానంలో నిలిచింది. మహీంద్రా థార్ 67,252 యూనిట్లతో 15వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ గణాంకాల్లో మూడు డోర్ల థార్ & థార్ రాక్స్ రెండు మోడళ్ల అమ్మకాలు కలిపి ఉన్నాయి.

2026 తొలి ఆరు నెలలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 15 కార్లు:

ర్యాంక్‌
మోడల్‌ 
2026 H1 సేల్స్‌
1
 
మారుతి సుజుకి డిజైర్
1,26,204
2
 
టాటా పంచ్
1,19,303
3
 
టాటా నెక్సాన్
1,18,166
4
 
మారుతి సుజుకి ఎర్టిగా
1,08,295
5
 
మారుతి సుజుకి వాగన్ ఆర్
1,00,704
6
 
మారుతి సుజుకి స్విఫ్ట్ 
97,747
7
 
 మారుతి సుజుకి బలెనో
96,996
8
 
మారుతి సుజుకి ఫ్రాంక్స్
95,441
9
 
హ్యుందాయ్ క్రెటా
91,391
10
 
మహీంద్రా స్కార్పియో
89,375
11
 
మారుతి సుజుకి బ్రెజ్జా
88,967
12
 
మారుతి సుజుకి విక్టోరిస్
73,912
13
 
మారుతి సుజుకి ఈకో
71,424
14
 
హ్యుందాయ్ వెన్యూ 
68,964
15
 
మహీంద్రా థార్ 
67,252

మొత్తంగా చూస్తే, 2026 తొలి ఆరు నెలల కార్ల అమ్మకాల జాబితాలో మారుతి సుజుకి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ, ఎంపీవీ & వాన్ వంటి దాదాపు అన్ని విభాగాల్లో తన ఉనికిని చాటుకుంటూ, టాప్ 15లో ఏకంగా 9 మోడళ్లను నిలపడం  ఈ కంపెనీ మార్కెట్ బలాన్ని మరోసారి స్పష్టం చేసింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.