7 Seater Kia Syros Launching Soon: దక్షిణ కొరియా కంపెనీ కియా భారత మార్కెట్లోకి కొత్త 7 సీటర్ కారును విడుదల చేయనుంది. కియా లాంచ్ చేసిన ఈ కొత్త కారు మీ బడ్జెట్‌లో ఉండటమే కాకుండా గొప్ప ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. కియా రూపొందించిన ఈ ఎస్‌యూవీ సైరోస్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
కియా సైరోస్ డిసెంబర్ 19వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇది సోనెట్, సెల్టోస్ ఎస్‌యూవీ మధ్య స్థానాన్ని తీసుకోనుంది. కొత్త కియా సైరోస్ గొప్ప ఫీచర్లతో ప్రవేశించబోతోంది.
ఈ కారు బయటవైపు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. మీరు ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందాలని భావిస్తున్నారు.
Also Read: హీరో స్ప్లెండర్ వర్సెస్ హోండా షైన్ - రెండు మైలేజీ బైక్‌ల్లో ఏది బెస్ట్?
కియా సైరోస్ పవర్‌ట్రెయిన్, ఫీచర్లు
కియా సైరోస్ పవర్‌ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ కానుంది.
కొత్త కియా సైరోస్ ఎస్‌యూవీలో అనేక అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ఇది 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాతో సహా అనేక ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు.
సెక్యూరిటీ ఫీచర్లు, ధర ఎంత?
కియా సైరోస్ సెక్యూరిటీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, టీపీఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. కొత్త కియా సైరోస్ ఎస్‌యూవీని చాలా తక్కువ ధరలో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. తొమ్మిది లక్షలుగా నిర్ణయించారని సమాచారం. మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో ఐదు లేదా ఏడు సీట్ల ఆప్షన్‌ను ఇవ్వవచ్చు.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే - నెక్సాన్ నుంచి సోనెట్ వరకు!