Hero Splendor VS Honda Shine: మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు దాని ధరను తెలుసుకునే ముందు మైలేజీ గురించి తెలుసుకోవాలి. అదే సమయంలో భారతీయ మార్కెట్లో ఇలాంటి బైక్‌లు చాలా ఉన్నాయి. ఇవి మంచి మైలేజీని కూడా ఇస్తాయి. ఈ బైక్‌ల జాబితాలో హీరో స్ప్లెండర్, హోండా షైన్ పేర్లు కూడా ఉన్నాయి. హీరో స్ప్లెండర్, హోండా షైన్‌ల్లో ఏ బైక్ ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.


హీరో స్ప్లెండర్ (Hero Splendor)
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో హీరో స్ప్లెండర్ ఒకటి. ఈ మోటార్‌సైకిల్ కొన్నేళ్లుగా దేశ ప్రజలకు ఇష్టమైనది. హీరో లాంచ్ చేసిన ఈ బైక్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను కలిగి ఉంది. బైక్‌లోని ఈ ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 5.9 కేడబ్ల్యూ పవర్‌ని, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 11 రంగులు, గ్రాఫిక్ ఆప్షన్లతో వస్తుంది.


హోండా షైన్ (Honda Shine)
హోండా షైన్ కూడా శక్తివంతమైన బైక్. ఈ మోటార్‌సైకిల్‌లో 123.94 సీసీ 4 స్ట్రోక్ ఎస్ఐ బీఎస్6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7,500 ఆర్పీఎం వద్ద 7.9 కేడబ్ల్యూ పవర్‌ని, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ బైక్ ఐదు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది.



Also Read: స్కోడా కైలాక్ రేటు రివీల్ అయ్యేది అప్పుడే - డెలివరీ ఎప్పుడు వస్తుంది?


హీరో స్ప్లెండర్ లేదా హోండా షైన్‌ల్లో ఏది బెటర్?
హీరో స్ప్లెండర్ దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన బైక్‌లలో ఒకటి. ఈ మోటార్‌సైకిల్ 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లుగా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. హోండా షైన్ 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఈ బైక్ సింగిల్ ట్యాంక్ ఫిల్లింగ్‌పై 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.


ఈ బైక్‌ల ధర ఎంత?
హీరో స్ప్లెండర్‌లో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందించారు. బైక్‌పై ఉన్న పొడవైన సీటు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ ఎమిషన్స్‌ను తగ్గించే ఈ హీరో బైక్‌లో ఐ3ఎస్ టెక్నాలజీని ఉపయోగించారు. హీరో స్ప్లెండర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.75,441 నుంచి ప్రారంభం అవుతుంది.


హీరో షైన్ హెడ్‌ల్యాంప్‌లో హాలోజన్ బల్బులు ఉపయోగించారు. ఈ బైక్‌లోని సీటు పొడవు 651 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ హోండా బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 162 మిల్లీమీటర్లుగా ఉంది. ఢిల్లీలో హోండా షైన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.81,251 నుంచి ప్రారంభం అవుతుంది. నగరాన్ని బట్టి ఈ బైక్ ధరలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి మీ యూసేజ్‌ను బట్టి మీకు కావాల్సిన బైక్‌ను ఎంచుకోండి.



Also Read: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?