Upcoming Kia Micro SUV: దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ఇటీవల భారతదేశంలో "క్లావిస్" అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ‘క్లావిస్’ పేరును కంపెనీ దాని ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. ఇది రాబోయే కొన్ని సంవత్సరాల్లో లాంచ్ కానుంది. హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా పంచ్‌లకు పోటీగా కియా క్లావిస్ మైక్రో ఎస్‌యూవీ రావచ్చు. ఇది నిజమని తేలితే కొత్త కియా మైక్రో ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు, ఇంజిన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌ను పోలి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది కాకుండా హ్యుందాయ్ వెర్నా ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడే మిడ్ సైజ్ సెడాన్‌ను కియా లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దేశంలో సెడాన్ సెగ్మెంట్ విక్రయాలు భారీగా క్షీణించడంతో ఇది జరుగుతుందో లేదో తెలియరాలేదు.


2024లో చాలా కొత్త కార్లు
కియా ఇండియా తన భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించింది. కంపెనీ అప్‌డేట్ చేసిన సోనెట్‌ను 2024 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ఆ తర్వాత కొత్త తరం కియా కార్నివాల్, కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త సోనెట్ కోసం బుకింగ్ విండో డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్లు రూ. 25,000 టోకెన్ అమౌంట్‌తో దీన్ని బుక్ చేసుకోవచ్చు.


కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు
కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్ కొలిజన్ మిటిగేషన్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, మరిన్నింటిని కలిగి ఉన్న ప్రత్యేకమైన లెవల్ 1 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీని అమర్చారు. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన అన్ని వేరియంట్‌లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి ఫీచర్లతో వచ్చాయి. అయితే బ్లైండ్ వ్యూ మానిటర్, కార్నరింగ్ ల్యాంప్స్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరాతో సహా మోడర్న్ సెక్యూరిటీ ఫీచర్లు హై ఎండ్ ట్రిమ్‌ల్లో మాత్రమే కనిపిస్తాయి.


అనేక ఫీచర్లతో...
టాప్ లెవల్ సోనెట్ ట్రిమ్ బోస్ ఆడియో సిస్టమ్, లెథెరెట్ అప్‌హోల్ట్స్రరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, ఎల్ఈడీ యాంబియంట్ లైటింగ్‌తో సహా అదనపు విలాసవంతమైన అంశాలతో వస్తుంది. జీటీఎక్స్ ప్లస్ ట్రిమ్ సొగసైన ఎల్ఈడీ ఫాగ్ లైట్లు, డార్క్ మెటాలిక్ యాక్సెంట్‌లతో కూడిన స్కిడ్ ప్లేట్లు, 16 అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, స్టీరింగ్ వీల్‌పై జీటీ లైన్ లోగో, గ్లోస్ బ్లాక్ రూఫ్ రాక్, ఏసీ వెంట్స్ వంటి కొన్ని స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్‌లను కూడా ఈ కారులో అందించనున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!