Kia India Announces Massive Discounts And Offers Across Lineup: కియా ఇండియా తన కార్ల లైనప్‌పై మే 2026 నెలకు సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్త కియా ఎస్‌యూవీ (SUV) లేదా ఎంపీవీ (MPV) కారు కొనాలనుకునే కస్టమర్లు సెలెక్ట్ చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. కియా కార్నివాల్, కియా కారెన్స్ క్లావిస్, కియా సెల్టోస్, కియా సైరోస్, కియా సోనెట్ వంటి మోడళ్లు ఈ ఆఫర్ల జాబితాలో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లలో ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయి. డీలర్‌షిప్ స్టాక్, నగరం, కొనుగోలుదారుల అర్హత ఆధారంగా ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది.
కార్నివాల్, కారెన్స్ క్లావిస్ మోడళ్లపై బిగ్ డిస్కౌంట్లు
ఈ నెలలో లగ్జరీ ఎంపీవీ కియా కార్నివాల్‌పై అత్యధికంగా రూ. 2.70 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 2 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ సపోర్ట్ తో పాటు స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రీమియం ఫ్యామిలీ కారుగా పేరు తెచ్చుకున్న కియా కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. వీటితో పాటు ఉచితంగా 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీ లభిస్తుంది. దీని డీజిల్, నార్మల్ పెట్రోల్ వెర్షన్లపై రూ. 85,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. కారెన్స్ క్లావిస్ ఈవీ (EV) ఎలక్ట్రిక్ మోడల్ కొనేవారికి రూ. 2.15 లక్షల వరకు టోటల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: Best Mileage Cars: పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
సెల్టోస్, సైరోస్ కార్లపై ..
కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ కియా సెల్టోస్ ఎమ్‌వై25 (MY25) స్టాక్‌పై రూ. 95,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ప్రీమియం క్యాబిన్, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఉండే ఈ కారు మార్కెట్ లో హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. మరో మోడల్ కియా సైరోస్ ఎమ్‌వై25 ఇన్వెంటరీపై రూ. 85,000 వరకు బెనిఫిట్స్ ఉండగా, కొత్త ఎమ్‌వై26 (MY26) యూనిట్లపై రూ. 50,000 వరకు తక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. ఫీచర్ లోడెడ్ ఇంటీరియర్ ఇష్టపడే కస్టమర్లను ఈ కార్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
సోనెట్, స్టాండర్డ్ కారెన్స్ పై క్యాష్ బెనిఫిట్స్
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న కియా సోనెట్ ఎమ్‌వై26 స్టాక్‌పై రూ. 35,000 వరకు, ఎమ్‌వై25 యూనిట్లపై రూ. 30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు మార్కెట్ లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO లతో పోటీ పడుతోంది. వీటితో పాటు స్టాండర్డ్ కియా కారెన్స్ మోడల్ పై ఈ నెల రూ. 40,000 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ స్పేస్, మోడర్న్ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఈ ఎంపీవీ కారు మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఖచ్చితమైన ఆఫర్ వివరాల కోసం కస్టమర్లు తమ సమీప కియా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
