City Facelift Loan EMI Calculator: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఎట్టకేలకు లాంచ్ అయింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. మార్కెట్ లో సెడాన్ కార్ల సేల్స్ తగ్గుతున్నప్పటికీ హోండా సిటీ తన ప్రీమియం లుక్, అప్‌మార్కెట్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు మంచి డిమాండ్ సాధిస్తోంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ద్వారా అమ్మకాలను మరింత పెంచుకోవాలని హోండా ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త సెడాన్ కారును ఫైనాన్స్ లేదా లోన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఈఎంఐ (EMI) అంచనాల వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
Read Also: Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్
వేరియంట్ల వారీగా ధరల జాబితా..
డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అప్‌డేట్స్ వచ్చినప్పటికీ ఈ సెడాన్ కారులో నమ్మకమైన పాత 1.5-లీటర్ పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లనే కొనసాగించారు. దీని బేస్ మోడల్ ఎస్‌వీ మాన్యువల్ ధర రూ. 11,99,900 గా ఉండగా, మిడ్ వేరియంట్లు వి మాన్యువల్ రూ. 13,29,900, వి సీవీటీ రూ. 14,29,900 ధరల్లో లభిస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లయిన జెడ్ఎక్స్ మాన్యువల్ రూ. 15,25,900, జెడ్ఎక్స్ ప్లస్ మాన్యువల్ రూ. 16,14,900, జెడ్ఎక్స్ సీవీటీ రూ. 16,25,900 గా ఉన్నాయి. అలాగే జెడ్ఎక్స్ ప్లస్ సీవీటీ రూ. 17,14,900 కాగా, టాప్ వేరియంట్ జెడ్ఎక్స్ ప్లస్ ఈ:హెచ్‌ఈవీ హైబ్రిడ్ మోడల్ ధర రూ. 20,99,900 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
టాప్ ఎండ్ హైబ్రిడ్ ఈఎంఐ లెక్కలు..
ఈ కారు టాప్ వేరియంట్ 'జెడ్ఎక్స్ ప్లస్ ఈ:హెచ్‌ఈవీ (స్ట్రాంగ్ హైబ్రిడ్) సీవీటీ' ధర రూ. 20.99 లక్షలుగా ఉంది. దీనికి 100 శాతం ఎక్స్-షోరూమ్ ధరను లోన్ అమౌంట్‌గా తీసుకుని, 9.5 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తే కాలపరిమితిని బట్టి ఈఎంఐ మారుతుంది. ఒకవేళ కస్టమర్ 36 నెలల (3 ఇయర్స్) రీపేమెంట్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 67,266 గా ఉంటుంది. ఈ మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం వడ్డీ విలువ రూ. 3,21,676 గా మారుతుంది. తక్కువ కాలంలో లోన్ క్లియర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
నాలుగు, ఐదేళ్ల లోన్ టెన్యూర్ వివరాలు
ఒకవేళ నెలవారీ భారం తగ్గించుకోవడానికి కస్టమర్ 48 నెలల (4 ఇయర్స్) రీపేమెంట్ కాలపరిమితిని ఎంచుకుంటే ప్రతి నెల కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ రూ. 52,756 కు తగ్గుతుంది. ఈ టెన్యూర్ కు మొత్తం వడ్డీ రూ. 4,32,392 అవుతుంది. అలాగే లోన్ టెన్యూర్‌ను గరిష్టంగా 60 నెలలకు (5 ఇయర్స్) పెంచుకుంటే నెలవారీ ఈఎంఐ మరింత తగ్గి రూ. 44,102 అవుతుంది. అయితే దీనివల్ల బ్యాంక్‌కు కట్టాల్సిన మొత్తం వడ్డీ భారం పెరిగి రూ. 5,46,209 కు చేరుకుంటుంది. ఈ ఫైనల్ ఈఎంఐ అనేది కస్టమర్ షోరూమ్ లో చెల్లించే డౌన్ పేమెంట్, తీసుకునే లోన్ మొత్తం, బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
