EV Battery Efficiency: భారత ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లో ఇప్పుడు ఒకే టెక్నాలజీని వేర్వేరు బాడీ స్టైళ్లలో అందించే ట్రెండ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అదే ట్రెండ్‌కు తాజా ఉదాహరణలు... కియా కేరెన్స్‌ క్లావిస్‌ EV & హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌. ఒకటి ఏడు సీట్ల eMPV, మరొకటి మిడ్‌సైజ్‌ SUV. టార్గెట్‌ చేసే కస్టమర్లు వేరు అయినా, టెక్నికల్‌గా ఈ రెండు కార్లలో చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి.

Continues below advertisement

ఈ రెండు ఎలక్ట్రిక్‌ కార్లలోనూ 51.4kWh బ్యాటరీ ప్యాక్‌, 171hp పవర్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఉంటుంది. ధరలు కూడా దగ్గరగానే (రూ.24.49 లక్షలు & రూ.23.67-24.70 లక్షలు) ఉండటంతో, “ఒకే బ్యాటరీ ఉంటే రియల్‌ వరల్డ్‌లో రేంజ్‌ ఎందుకు మారుతుంది?” అనే ప్రశ్న సహజంగా వస్తుంది. అదే ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.

స్పెసిఫికేషన్లు, ధర – ప్రాథమికంగా ఏంటి తేడా?

Continues below advertisement

పేపర్‌పై చూస్తే... బ్యాటరీ, మోటార్‌ రెండూ ఒకటే. కానీ బరువు విషయంలోనే పెద్ద తేడా ఉంది. కియా కేరెన్స్‌ క్లావిస్‌ EV ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వేరియంట్‌ (1725 కిలోలు), క్రెటా ఎలక్ట్రిక్‌తో (1577 కిలోలు) పోలిస్తే సుమారు 148 కిలోల ఎక్కువ బరువు ఉంటుంది. ఇదే అంశం డ్రైవింగ్‌ రేంజ్‌, ఎఫిషియెన్సీపై నేరుగా ప్రభావం చూపిస్తోంది.

ARAI సర్టిఫికేషన్‌ ప్రకారం చూస్తే, క్రెటా ఎలక్ట్రిక్‌ లాంగ్‌ రేంజ్‌, ఒకే చార్జ్‌తో, క్లావిస్‌ EV కంటే 20 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ ఇస్తుంది. పవర్‌-టు-వెయిట్‌, టార్క్‌-టు-వెయిట్‌ రేషియోలు మెరుగ్గా ఉండటంతో క్రెటా డ్రైవ్‌లో కూడా తేలికగా, ఈజీగా అనిపిస్తుంది.

ఈ రెండు కార్లలోనూ Eco, Normal, Sport అనే మూడు డ్రైవ్‌ మోడ్‌లు ఉన్నాయి. అలాగే సింగిల్‌ పెడల్‌ డ్రైవింగ్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. అంటే, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ సహాయంతో యాక్సిలరేటర్‌ వదిలేస్తేనే కారు పూర్తిగా ఆగిపోతుంది.

రియల్‌ వరల్డ్‌ రేంజ్‌ – ఇక్కడే అసలు తేడా

పేపర్‌ గణాంకాలు ఒక ఎత్తు అయితే... వాస్తవ రోడ్లపై ఫలితాలు మరో ఎత్తు. టెస్ట్‌ ఫలితాలు చూస్తే, క్రెటా ఎలక్ట్రిక్‌ స్పష్టమైన ఆధిక్యం చూపించింది.

సిటీ రేంజ్‌ (టెస్టెడ్‌):

కియా కేరెన్స్‌ క్లావిస్‌ EV: 383 కి.మీ.

హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌: 486 కి.మీ.

నగరంలో ఈ రెండు కార్ల మధ్య 100 కి.మీ.కు పైగా తేడా కనిపించడం గమనార్హం.

హైవే రేంజ్‌ (టెస్టెడ్‌):

కియా కేరెన్స్‌ క్లావిస్‌ EV: 345 కి.మీ.

హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌: 378 కి.మీ.

హైవేలో తేడా కొంత తగ్గినా, ఇక్కడ కూడా క్రెటా ముందే ఉంది.

సగటున, మొత్తం రియల్‌ వరల్డ్‌ రేంజ్‌:

క్లావిస్‌ EV: 364 కి.మీ.

క్రెటా ఎలక్ట్రిక్‌: 432 కి.మీ.

మొత్తంగా చూస్తే, క్రెటా ఎలక్ట్రిక్‌ సింగిల్‌ చార్జ్‌తో 68 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించింది.

బ్యాటరీ ఎఫిషియెన్సీ

ఇదే విషయాన్ని మరో కోణంలో చూస్తే –

క్లావిస్‌ EV: 7.08 కి.మీ/kWh

క్రెటా ఎలక్ట్రిక్‌: 8.4 కి.మీ/kWh

అంటే, ఒక యూనిట్‌ కరెంట్‌తో క్రెటా ఎలక్ట్రిక్‌ ఎక్కువ దూరం వెళ్తోంది.

ఈ టెస్టులు ఎలా చేశారు?

ఈ రేంజ్‌ టెస్టుల్లో బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేసి, కంపెనీ సూచించిన టైర్‌ ప్రెజర్‌ను పాటించారు. సిటీ, హైవేలో ఒకే లూప్‌లో కారు నడిపి, నిర్ణీత సగటు వేగాన్ని మెయింటైన్‌ చేశారు. ACని 22 డిగ్రీల వద్ద పెట్టి, సాధారణ వినియోగదారుడు వాడే విధంగానే ఆడియో, లైట్లు, వెంటిలేటెడ్‌ సీట్లు ఉపయోగించారు. బ్యాటరీ ఎంత శాతం ఖర్చయిందో లెక్కించి రేంజ్‌ను నిర్ణయించారు.

ఫైనల్‌ మాట

ఒకే బ్యాటరీ, ఒకే మోటార్‌ ఉన్నా.... బరువు, బాడీ స్టైల్‌, ఎయిరోడైనమిక్స్‌ వల్ల రియల్‌ వరల్డ్‌లో ఎంత పెద్ద తేడా వస్తుందో ఈ కంపారిజన్‌ స్పష్టంగా చూపిస్తోంది. మీకు ఏడు సీట్లు, కుటుంబ అవసరాలు ముఖ్యమైతే క్లావిస్‌ EV సరైన ఎంపిక. ఎక్కువ రేంజ్‌, మెరుగైన ఎఫిషియెన్సీ కావాలంటే మాత్రం క్రెటా ఎలక్ట్రిక్‌ స్పష్టంగా ముందంజలో ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.