Car Wiper Maintenance Tips: భారీ వర్షాలు కురిసినప్పుడు & దారి సరిగా కనిపించనప్పుడు కారు విండ్‌షీల్డ్ వైపర్‌లు డ్రైవర్‌కు, ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి కఠిన వాతావరణంలో ఇవి ఒక భద్రత కవచంలా పని చేస్తాయి. వైపర్లు విండ్‌షీల్డ్‌ను శుభ్రంగా & స్పష్టంగా ఉంచుతాయి, ఇది ప్రమాదాల అవకాశాలను తగ్గిస్తుంది. కానీ, వైపర్ల నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే అవి స్నేహితుడిగా కాకుండా శత్రువుగా మారే ప్రమాదం ఉంది.
కార్ వైపర్లను ఎంత చక్కగా చూసుకుంటే అంత ఎక్కువ కాలం మెరుగైన పనితీరును అందిస్తాయి. కారు వైపర్ నిర్వహణలో అందరూ సాధారణంగా చేసే తప్పులను మీరు నివారించగలిగితే... తుపాన్లు, దుమ్ము వాతావరణంలో అవి మీ ప్రయాణానికి భరోసా కల్పిస్తాయి. (Car maintenance tips)
1. కారును ఎండలో పార్క్ చేయవద్దుకార్ వైపర్ బ్లేడ్లను సాధారణంగా రబ్బరుతో తయారు చేస్తారు. ఇవి ఎక్కువ సూర్యకాంతికి గురైనప్పుడు ఎండిపోయి గట్టిపడతాయి. మీరు మీ వాహనాన్ని ఎండలో ఎక్కువ సార్లు పార్క్ చేసినప్పుడు వైపర్ బ్లేడ్ల రబ్బరు విరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా వాటిని ఉపయోగించే సమయంలో విండ్‌షీల్డ్‌పై గీతలు పడవచ్చు. కాబట్టి మీ వాహనాన్ని ఎప్పుడూ నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయండి లేదా కవర్‌తో అయినా కప్పి ఉంచండి.
2. నీరు లేకుండా వైపర్‌ను ఆపరేట్ చేయవద్దువిండ్‌షీల్డ్‌పై దుమ్ము లేదా ధూళి ఉన్నప్పుడు, కొంతమంది డ్రైవర్లు వాషర్ స్ప్రేను ఉపయోగించకుండా వైపర్‌లను ఆపరేట్ చేస్తారు. దీనివల్ల వైపర్ రబ్బరు ఉపరితలం త్వరగా అరిగిపోతుంది & గాజుపై గీతలు పడటానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వైపర్‌లను ఆపరేట్ చేసే ముందు ఎప్పుడూ విండ్‌షీల్డ్ వాషర్ లిక్విడ్‌ను ఉపయోగించండి.
3. వైపర్ బ్లేడ్‌లను క్రమం తప్పకుండా గమనిస్తుండాలివైపర్ బ్లేడ్ సగటు జీవితకాలం దాదాపు 12 నెలలు. కానీ, వాతావరణం & వినియోగంపై అది ఆధారపడి ఉంటుంది. వైపర్ నడుపుతున్నప్పుడు గీసుకుంటున్నట్లు శబ్దం వస్తే లేదా అది సరిగ్గా శుభ్రం కాకపోతే, దానిని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. వైపర్ బ్లేడ్ సగటు జీవితకాలం పెంచడానికి ఎప్పటికప్పుడు వైపర్ బ్లేడ్‌ను మృదువైన వస్త్రంతో శుభ్రం చేసి దానిపై పేరుకుపోయిన దుమ్ము & ధూళిని తొలగించండి.
4. డిటర్జెంట్ వాడేటప్పుడు జాగ్రత్తచాలా మంది, విండ్‌షీల్డ్ శుభ్రం చేయడానికి సాధారణ డిటర్జెంట్ లేదా సబ్బును ఉపయోగిస్తారు, అలా చేయడం వల్ల వైపర్ రబ్బరు దెబ్బతింటుంది. వైపర్ రబ్బరుపై ప్రభావం చూపకుండా గాజును మాత్రమే శుభ్రపరిచే కార్ షాంపూ లేదా తేలికపాటి గ్లాస్ క్లీనర్‌ను ఉపయోగించాలి.
5. వైపర్ స్క్రూలను తనిఖీ చేయడం మర్చిపోవద్దుసాధారణంగా, వర్షాకాలంలో మాత్రమే వైపర్ల వాడకం గుర్తుకు వస్తుంది, వాటి వినియోగం పెరుగుతుంది. వర్షాకాలానికి ముందు చాలాకాలం పాటు వాడకపోవడం వల్ల వైపర్ మౌంటింగ్స్ & స్క్రూలు వదులయ్యే అవకాశం ఉంటుంది. దీనిని సకాలంలో గమనించకపోతే వైపర్ సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు వైపర్ స్క్రూలను సున్నితంగా బిగించి, వాటి కదలిక స్థిరంగా & సజావుగా ఉండేలా చూసుకోండి.