డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో 'ఢీ' (Dhee Movie) ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికీ ఈ సినిమా చాలా మందికి స్ట్రెస్ బస్టర్. ఇందులో కామెడీ అంత బావుంటుంది మరి. జూన్ 6వ తేదీ అంటే ఈ రోజు సినిమాను రీ రిలీజ్ చేశారు. అభిమానులతో కలిసి చూసేందుకు సినిమా హాలుకు వెళుతున్నారు విష్ణు మంచు.
ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు విష్ణు మంచు...సాయంత్రం అభిమానులతో కలిసి!విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కన్నప్ప'. ఈ నెలలో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జూన్ 27న థియేటర్లలోకి వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. దానికి ముందు ఢీ రిలీజ్ కావడం మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు.
హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు ఈరోజు సాయంత్రం విష్ణు మంచు వెళ్ళనున్నారు. అభిమానులతో కలిసి ఏడు గంటల షో చూస్తారు. ఆ తరువాత అభిమానులతో పాటు ప్రేక్షకులను కలిసి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.
'ఢీ' సినిమాలో విష్ణు మంచు సరసన జెనీలియా నటించారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం, సునీల్, విష్ణు కలయిక లోని సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. దివంగత నటుడు శ్రీహరి సినిమాలో కీలక పాత్ర చేశారు. జెనీలియాకు అన్నయ్యగా ఆయన నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి.