Kawasaki Offer on Ninja 650 and Vulcan S: కవాసకి ఇండియా తన బైక్‌లపై బంపర్ ఆఫర్‌లను తీసుకొచ్చింది. నింజా 650, వల్కాన్ ఎస్‌లపై భారీ ఆఫర్లు అందించబడుతున్నాయి. ఈ బైక్‌లపై కంపెనీ గుడ్ టైమ్స్ వోచర్‌లను జారీ చేసింది. వల్కాన్ ఎస్‌లో రూ. 30 వేల వోచర్ అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు నింజా 650పై రూ. 60 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కవాసకి బైక్‌లపై ఆఫర్ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం అయింది.
కవాసకి మోడల్స్ ధర
కవాసకి నింజా 650 ఎక్స్-షోరూమ్ ధర రూ.7.16 లక్షలు, వల్కన్ ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.10 లక్షలుగా ఉంది. రెండు బైక్‌ల్లో 649 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అందించారు. ఒకే ఇంజన్ ఉన్నప్పటికీ దాని ట్యూనింగ్ భిన్నంగా ఉంటుంది. రెండు బైక్‌ల ఫీచర్లను బట్టి చూస్తే వీటిని బాగా ట్యూన్ చేశారు. కవాసకి ఈ రెండు బైక్‌లపై గొప్ప వోచర్ ఆఫర్ అందిస్తున్నారు.
కవాసకి నింజా 650 ఒక గొప్ప మోడల్. ఇది 8000 ఆర్పీఎం వద్ద 67 బీహెచ్‌పీ పవర్‌ని, 7700 ఆర్పీఎం వద్ద 64 ఎన్ఎం టార్క్‌ను కలిగి ఉంటుంది. వల్కాన్ ఎస్ కూడా కవాసకి శక్తివంతమైన బైక్. వల్కన్ ఎస్ గరిష్టంగా 7500 ఆర్పీఎం వద్ద 60 బీహెచ్‌పీ పవర్‌ని, 6600 ఆర్పీఎం వద్ద 62.4 ఎన్ఎం టార్క్‌ను డెలివర్ చేయగలదు. రెండు మోటార్‌సైకిళ్లకు 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.
కవాసకి కొత్త మోడల్
కవాసకి తన కంపెనీకి చెందిన కొత్త మోడల్‌ను ఇటీవల విడుదల చేసింది. కవాసకి కొత్త మోడల్ 2024 Z900 ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ బైక్ 2023 మోడల్‌కి అప్‌డేటెడ్ వెర్షన్. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.29 లక్షలుగా ఉంది. దీని ధర 2023 మోడల్ కంటే రూ.9 వేలు ఎక్కువగా నిర్ణయించారు. ఈ మోడల్ రెండు కలర్ షేడ్స్ లో లాంచ్ అయింది. ఈ బైక్ మెటాలిక్ స్పార్క్ బ్లూ, మెటాలైట్ మెటా గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్‌లో మార్కెట్లోకి వచ్చింది.