Jeep Meridian Launch: ప్రముఖ కార్ల బ్రాండ్ జీప్(Jeep) మనదేశంలో కొత్త కారును లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. దానికి మెరిడియన్(Meridian) అని పేరు పెడతారని తెలుస్తోంది. ఇది ఏడు సీటర్ల ఎస్‌యూవీ అని తెలుస్తోంది. జీప్ కంపాస్ (Jeep Compass) కంటే హైరేంజ్‌లోనే ఇది లాంచ్ కానుంది. ఈ సంవత్సరం మధ్యలో జీప్ మెరిడియన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అంటే త్వరలో కొన్ని నెలల్లోనే ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉందన్న మాట. జీప్ కంపాస్ ప్లాట్‌ఫాంపైనే దీన్ని కూడా రూపొందించారు. అయితే మెరిడియన్ జీప్ కంటే పెద్దగా ఉండనుంది. అదనంగా మూడో వరుస సీట్లు కూడా ఇందులో అందించనున్నారు.
కంపాస్ కంటే దీని చక్రాలు, డోర్లు పెద్దగా ఉండనున్నాయి. దీంతోపాటు ఇందులో కొత్త తరహా డిజైన్ ఉన్న హెడ్ ల్యాంప్స్ ఉండనుంది. కారు లోపల కంపాస్ ఫేస్ లిఫ్ట్ తరహాలోనే 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉండనున్నాయి. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరిన్ని ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
అయితే ఈ కారుకు సంబంధించిన మిగతా వివరాలను జీప్ వెల్లడించలేదు. కానీ ఇందులో 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఉుండనుంది. దీంతోపాటు స్టాండర్డ్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండనుంది. ఈ ఫోన్ లాంచ్‌కు దగ్గరయ్యే సమయంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. టొయోటా ఫార్ట్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కోడియాక్‌లకు ఇది పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!
Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!