Jeep New SUV: జీప్ (Jeep) తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది ఒక చిన్న సైజులో ఉండే ఎస్‌యూవీ. రెనెగేడ్ (Renegade) కంటే ఇది చిన్నగా ఉంటుంది. ఇది త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. మనదేశంలో జీప్ లాంచ్ చేయబోయే మొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే.
ఎంజీ జెడ్ఎస్ (MG ZS), టాటా నెక్సాన్ ఈవీలతో (Tata Nexon EV) ఇది పోటీ పడనుంది. ఈ కొత్త ఎస్‌యూవీకి జీప్ ఇంకా ఎటువంటి పేరూ పెట్టలేదు. అయితే దీని గురించిన వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది. డిజైన్ పరంగా కూడా మిగతా జీప్ వాహనాల కంటే కొత్తగా, చిన్నగా ఉండనుంది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ చూడటానికి జీప్ కంపాస్ తరహాలో ఉండనుంది. కానీ ముందువైపు మరింత చిన్నగా ఉండనుంది. దీని చక్రాలు పెద్దగా ఉండనున్నాయి. డోర్ హ్యాండిల్స్‌ను వెనకవైపు హైడ్ చేశారు. లుక్ క్లీన్‌గా ఉండటం కోసం విండో పైన ఉంచారు. వెనకవైపు లైట్లు చూడటానికి బాగున్నాయి.
జీప్ బ్రాండ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటూనే... వీలైనంత చిన్నగా కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2023లో ప్రపంచ మార్కెట్లోకి, 2024లో మనదేశంలోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, నెక్సాన్ ఈవీలతో ఇది పోటీ పడే అవకాశం ఉంది.
రెండు సంవత్సరాల్లో పూర్తిగా ఎలక్ట్రిక్
మరో రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది జీప్ కంపెనీకి చెందిన ప్రొడక్ట్ కాబట్టి... ఇందులో నాలుగు సీట్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఎక్కువ రేంజ్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం జీప్ మనదేశంలో జీప్ మెరీడియన్ 7-సీటర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది ఫార్ట్యూనర్‌కు పోటీ ఇవ్వనుంది. దీంతోపాటు జీప్ గ్రాండ్ చెరోకీ లగ్జరీ ఎస్‌యూవీ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!
Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!