తక్కువ ధర, మంచి బ్యాటరీ సామర్థ్యం, మరింత వేగం ఉన్న హ్యాచ్ బ్యాక్ కార్ల కోసం చాలా మంది వెతుకుతుంటారు. ఏకారు కొనుగోలు చేయాలా? అని ఆలోచిస్తుంటారు. అందుకే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రూ.10 లక్షల్లోపు అదిరిపోయే హ్యాచ్ బ్యాక్ కార్ల లిస్టు మీ ముందు ఉంచుతున్నాం. మీకు నచ్చిన కారును ఎంచుకోవచ్చు.

   


రూ.10 లక్షల లోపు టాప్ 10 హ్యాచ్‌ బ్యాక్ కార్లు ఇవే!


1.మారుతి సుజుకి ఆల్టో K10


దేశీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన మారుతి సుజుకి మోడల్‌లలో ఆల్టో కె10 ఒకటి. ఇది ఇటీవల కొత్త ఫ్రంట్, రియర్ ఫాసియాతో అప్‌ డేట్ చేయబడింది. మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం అప్పీల్ కోసం ఇంటీరియర్ కొద్దిగా ట్వీక్ చేయబడింది. Alto K10 నాలుగు ట్రిమ్ రేంజిల్లో లభిస్తున్నది. CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ధరలు రూ. 4.42 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. CNG మోడల్‌  రూ. 6.56 లక్షల వరకు ఉంటుంది.


2.రెనాల్ట్ క్విడ్


మారుతి సుజుకి ఆల్టో పోటీదారు రెనాట్ క్విడ్. ఫ్రెంచ్ మార్క్ చిన్న హ్యాచ్‌ బ్యాక్ మూడు ట్రిమ్ రేంజిల్లో లభిస్తుంది.  రెనాల్ట్ క్విడ్ 10 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధరలు రూ. 5.24 లక్షల నుంచి మొదలై, రూ. 6.93 లక్షల వరకు ఉంటాయి. క్విడ్ అద్భుతమైన డిజైన్, మంచి రైడ్ క్వాలిటీని కలిగి ఉంది


3.మారుతీ సుజుకి సెలెరియో


మారుతి సుజుకి సెలెరియో గత సంవత్సరం పూర్తిగా మేక్ ఓవర్ పొందింది. ఇది మూడు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ధరలు రూ. 5.82 లక్షల నుంచి రూ. 7.81 లక్షల వరకు ఉన్నాయి.


4.టాటా టియాగో


సబ్ కాంపాక్ట్ హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌ లో టాటా టియాగో అందుబాటులో ఉంది.  ఆల్టో కె10, సెలెరియో మాదిరిగా కాకుండా, టియాగో Icng,  EV వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ధరలు రూ. 6.12 లక్షల నుంచి మొదలై రూ. 8.91 లక్షల వరకు ఉన్నాయి.


5.హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS


హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS సబ్ కాంపాక్ట్ హ్యాచ్‌ బ్యాక్. కొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్ కోసం ఇటీవల అప్‌డేట్ చేయబడింది. సాంకేతికంగా, గ్రాండ్ i10 NIOS మొదటిసారిగా క్రూయిజ్ నియంత్రణ కలిగి ఉంది.  Grand i10 NIOS కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ. 11,000గా నిర్ణయించబడింది. ధరలను ఇంకా వెల్లడించలేదు.  


6.టాటా ఆల్ట్రోజ్


ఈ లిస్టులోని సురక్షితమైన హ్యాచ్‌ బ్యాక్‌లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. ALFA-ARC ఆర్కిటెక్చర్ ఆధారంగా, GNCAP క్రాష్ టెస్ట్‌లో  5 స్టార్‌లను సాధించిన ఏకైక హ్యాచ్‌ బ్యాక్ ఆల్ట్రోజ్. Altrozకి ఏడు ట్రిమ్ స్థాయిలు ఉన్నాయి. టర్బో ఇంజిన్ ఎంపికను కూడా అందిస్తుంది. విభిన్న ట్రాన్స్‌ మిషన్, పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పాటు, టాటా డార్క్ ఎడిషన్ మోడల్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆల్ట్రోజ్ మొత్తం 18 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధరలు రూ. 7.28 లక్షల నుంచి మొదలై, రూ. 12.29 లక్షల వరకు ఉన్నాయి.


7.సిట్రోయెన్ C3


ఈ లిస్టులో సిట్రోయెన్ C3 బేసి బాల్‌గా పరిగణించబడుతుంది. దీన్ని హ్యాచ్‌ బ్యాక్  అంటున్నా, పొడవైన, పెద్ద బాడీతో   సబ్ కాంపాక్ట్ SUVగా ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్‌లు ఉన్నాయి.  మూడు కలర్ టోన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి . ధరలు రూ. 6.65 లక్షల నుండి ప్రారంభమై, రూ. 9.34 లక్షల వరకు ఉన్నాయి. C3 రెండు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది.


8.మారుతీ సుజుకి బాలెనో


కాంపాక్ట్ హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న కారు బాలెనో. ఆల్టో, సెలెరియో మాదిరిగానే, బాలెనో  గత సంవత్సరం ఫేస్‌ లిఫ్ట్‌ ను పొందింది. ఫీచర్ జాబితా కూడా అప్ డేట్ చేయబడింది. తొలిసారి హెడ్స్ అప్ డిస్‌ ప్లేను పొందుతుంది. ఇది నాలుగు ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ధరలు రూ. 7.33 లక్షల నుంచి మొదలై రూ. 10.88 లక్షలకు ఉన్ఆయి.   


9.హ్యుందాయ్ ఐ20


హ్యుందాయ్ i20 చాలా అందంగా కనిపించే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి.  ఈ విభాగంలో అత్యంత విశాలమైన హాచ్‌లలో ఇది కూడా ఒకటి. i20 నాలుగు ట్రిమ్ స్థాయిల్లో ఉంటుంది.  ధరలు రూ. 8.08 లక్షల నుంచి మొదలై  రూ. 13.36 లక్షల వరకు ఉంటాయి.  i20 నాలుగు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో పాటు మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.


10.హోండా జాజ్


హ్యాచ్‌ బ్యాక్ విభాగంలో హోండా నుంచి కొనసాగుతున్న కారు జాజ్.  ఏడు-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌ తో కేవలం ఒక ఇంజన్ ఎంపికతో అందుబాటులో ఉంది. ఇది మూడు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది. ధరలు రూ.9.81 లక్షల నుంచి ప్రారంభమై రూ.12 లక్షల వరకు ఉన్నాయి.


Read Also: ఎలక్ట్రిక్ వాహనాలతో పర్యావరణాన్నే కాదు, ట్యాక్స్ కూడా ‘సేవ్’ చేయొచ్చు - ఇదిగో ఇలా!