Mahindra Thar Roxx MX5 Variant Price, Mileage And Features: SUV సెగ్మెంట్‌ను మహీంద్రా థార్ రాక్స్ నిజంగానే రాక్&షేక్ చేస్తోంది, కస్టమర్ల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ SUV విడుదలైనప్పటి నుంచి దీనికి చాలా డిమాండ్ ఉంది. మీరు థార్ రాక్స్ కొనే ప్లాన్‌లో ఉంటే, MX5 వేరియంట్ మీకు బెస్ట్ ఉత్తమమైన & డబ్బుకు తగిన విలువ కలిగిన ఎంపిక అవుతుందో, లేదో తెలుసుకోండి.
మహీంద్రా థార్ రాక్స్ MX5 ఫీచర్లుమహీంద్రా థార్ రాక్స్ MX5 వేరియంట్ ఒక మిడ్-రేంజ్ SUV అయినప్పటికీ, ఫీచర్ల పరంగా (Mahindra Thar Roxx MX5 Features) ప్రీమియం ఆప్షన్ అవుతుంది. ఇందులో 26.03 సెం.మీ. భారీ HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్లు & 2 ట్వీటర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ వంటి కంఫర్టబుల్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా.. రియర్ AC వెంట్, ఆటో హెడ్‌ల్యాంప్, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్, ఆటో వైపర్, రియర్ డీఫాగర్ & వాషర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, లెథరెట్ సీటింగ్, LED హెడ్‌ల్యాంప్ & ఫాగ్ లైట్లు వంటి ప్రీమియం ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లుభద్రత విషయంలోనూ మహీంద్రా థార్ రాక్స్ MX5 వేరియంట్ (Mahindra Thar Roxx MX5 Safety Features) తక్కువ కాదు. ఈ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఆటో డిమ్మింగ్ IRVM, ఎత్తును సర్దుబాటు చేయగల సీట్ బెల్టులు, ISOFIX చైల్డ్ యాంకర్ పాయింట్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్‌లు & వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ESC, HHC, HDC, TCS, ROM, బ్రేక్ డిస్క్ వైపింగ్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, EBD, ABS, ESS & VDC వంటి అత్యాధునిక భద్రత సాంకేతికతలు కూడా ఈ బండిలో చూడవచ్చు. ఈ రక్షణల ఫలితంగా మహీంద్రా థార్ రాక్స్ MX5 వేరియంట్ ఈ సెగ్మెంట్‌లో సురక్షితమైన SUVగా నిలిచింది.
పనితీరు ఎలా ఉంది?మహీంద్రా థార్ రాక్స్ MX5 రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో లాంచ్ అయింది. మొదటి ఆప్షన్ 2.0L mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది, పవర్‌ఫుల్ పికప్‌తో స్మూత్ జర్నీని అందిస్తుంది. రెండో ఆప్షన్ 2.2L mHawk డీజిల్ ఇంజిన్, ఇది RWD & 4WD లో ఉంటుంది. లో-ఎండ్ టార్క్ & ఇంధన సామర్థ్యం కోసం ఇది మంచిది.
ధర మహీంద్ర థార్ రాక్స్ MX5 పెట్రోల్ వేరియంట్ (MT, RWD) ఎక్స్-షోరూమ్ ధర (Mahindra Thar Roxx MX5 ex-showroom price) రూ. 16.70 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ (MT, 4WD) ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.39 లక్షలు. ఇన్ని ప్రీమియం ఫీచర్లు & పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పోలిస్తే ఈ ధర పూర్తిగా సహేతుకమేనని ఆటో ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మహీంద్రా థార్ లైనప్‌లో డబ్బుకు తగిన విలువను అందించే వేరియంట్‌గా నిలిచిందని అంటున్నారు.