Indian Oil Servo Hyper Series lubricants: దేశంలోని ప్రముఖ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ (Indian Oil), తన Servo బ్రాండ్‌ను మరింత విస్తరిస్తూ కొత్త సెర్వో హైపర్ సిరీస్ (Servo Hyper Series) ప్రీమియం లూబ్రికెంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధునిక ఇంజిన్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కొత్త ఉత్పత్తులు కార్లు, బైక్‌లు, స్కూటర్లు & వాణిజ్య వాహనాలకు అనువుగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అత్యాధునిక సింథటిక్ బేస్ ఆయిల్స్ & నెక్స్ట్ జనరేషన్ అడిటివ్ టెక్నాలజీతో ఈ లూబ్రికెంట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
కంపెనీ చెప్పిన ప్రకారం, సెర్వో హైపర్ సిరీస్, ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే సాధారణ లూబ్రికెంట్లతో పోలిస్తే ఎక్కువ డ్రెయిన్ ఇంటర్వల్‌ను అందించడం వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. కఠినమైన డ్రైవింగ్ పరిస్థితుల్లో కూడా ఇంజిన్‌కు మెరుగైన రక్షణను అందించేలా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు వెల్లడించింది.
మూడు రకాలుకొత్త సెర్వో హైపర్ సిరీస్‌ను మూడు ప్రధాన విభాగాలుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్ల కోసం హైపర్ డ్రైవ్ (Hyper Drive), బైక్‌ల కోసం హైపర్ స్పోర్ట్ (Hyper Sport) & వాణిజ్య వాహనాల కోసం హైపర్ టార్క్ (Hyper Torq) పేర్లతో ఈ ఉత్పత్తులను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: రూ.4.53 లక్షలకే 2026 Renault Kwid లాంచ్ - కొత్త స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, CNG ఆప్షన్
కార్ల కోసం అందుబాటులో ఉన్న హైపర్ డ్రైవ్ సిరీస్‌లో రెండు రకాల ఉత్పత్తులు ఉన్నాయి. సాధారణ హైపర్ డ్రైవ్‌ను BS6 పెట్రోల్ & డీజిల్ కార్ల కోసం రూపొందించారు. ఇది Honda, Chevrolet, Ford, Toyota, Nissan, Maruti Suzuki, MG, Renault, Hyundai, Citroen, Volkswagen Group, BMW, Mercedes-Benz వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లకు అనుకూలంగా ఉంటుందని ఇండియన్ ఆయిల్ తెలిపింది.
ఇక, హైపర్ డ్రైవ్ నెక్ట్స్ (Hyper Drive NXT)ను అధిక పనితీరు కలిగిన కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది పెట్రోల్, డీజిల్, CNG, ఫ్లెక్స్ ఫ్యూయల్ & హైబ్రిడ్ వాహనాలకు అనుకూలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా హైబ్రిడ్ వాహనాల్లో కోల్డ్ స్టార్ట్ సమయంలో మెరుగైన పనితీరు ఇవ్వడంతో పాటు E85 పెట్రోల్‌కు కూడా అనువుగా ఉండేలా దీనిని అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
బైక్‌ల కోసంహైపర్ స్పోర్ట్ సిరీస్‌ను మూడు వేరియంట్లలో అందిస్తోంది. హైపర్ స్పోర్ట్ F5ను Superbike & Racing మోటార్‌సైకిళ్ల కోసం రూపొందించారు. BMW Motorrad, Ducati, Suzuki, Kawasaki, Yamaha, KTM & Honda వంటి బ్రాండ్ల హై పెర్ఫార్మెన్స్ బైక్‌లకు ఇది సిఫార్సు చేయబడింది. ఈ లూబ్రికెంట్‌తో గరిష్ఠంగా 10,000 కిలోమీటర్ల వరకు డ్రెయిన్ ఇంటర్వల్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: 160 km రేంజ్, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
హైపర్ స్పోర్ట్ 4Tని ఎక్కువశాతం 4-Stroke మోటార్‌సైకిళ్ల కోసం రూపొందించారు. ముఖ్యంగా Royal Enfield, Hero MotoCorp, Bajaj, TVS, Honda, Yamaha వంటి బ్రాండ్ల బైక్‌లకు ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే హైపర్ స్పోర్ట్ స్కూటర్‌ను 4-స్ట్రోక్ గేర్‌లెస్ స్కూటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రెండు ఉత్పత్తుల్లో గరిష్ఠంగా 8,000 కిలోమీటర్ల వరకు డ్రెయిన్ ఇంటర్వల్ లభిస్తుంది.
వాణిజ్య వాహనాల కోసం హైపర్ టార్క్ సిరీస్‌ను కూడా మూడు వేరియంట్లలో విడుదల చేసింది. సాధారణ Hyper Torqను BS4 & అంతకంటే పాత ప్రమాణాలకు చెందిన హెవీ డ్యూటీ డీజిల్ ట్రక్కుల కోసం రూపొందించారు. దీనితో గరిష్ఠంగా 80,000 కిలోమీటర్ల వరకు డ్రెయిన్ ఇంటర్వల్ లభిస్తుంది.
హైపర్ టార్క్ NXTని BS6 వాణిజ్య వాహనాల కోసం అభివృద్ధి చేశారు. ఇందులో గరిష్ఠంగా 1,20,000 కిలోమీటర్ల వరకు డ్రెయిన్ ఇంటర్వల్ అందుబాటులో ఉంటుంది. ఇక హైపర్ టార్క్XP పూర్తిగా సింథటిక్ ఇంజిన్ ఆయిల్. తక్కువ సల్ఫర్ ఇంధనంతో పనిచేసే ట్రక్ ఇంజిన్ల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్లు Indian Oil తెలిపింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
