Revolt RVX Price, Range And Features: భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి Revolt Motors తన కొత్త RVX మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు కంపెనీ విడుదల చేసిన బైక్‌లలో ఇదే అత్యంత శక్తివంతమైన మోడల్. కొత్త మిడ్-డ్రైవ్ మోటార్, బయటకు తీసి ఛార్జ్ చేసుకునే బ్యాటరీ, నాలుగు రైడింగ్ మోడ్స్ & కనెక్టెడ్ ఫీచర్లతో ఈ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. Revolt RVX కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే.
మొదట ధర గురించి మాట్లాడుకుందాం. Revolt RVX ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. అయితే ఇది ప్రారంభ ఆఫర్ ధర మాత్రమేనని, భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని తెలిపింది. EV కాబట్టి, రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్రాన్ని బట్టి ఈ బండికి కొన్ని రాయితీలు అందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బైక్ ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1.40 లక్షలు ఉంటుంది.
రెండో ముఖ్యమైన అంశం రేంజ్. Revolt RVXలో 3.24kWh సామర్థ్యం గల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీకి IP67 రేటింగ్ ఉండటంతో దుమ్ము & నీటి నుంచి మంచి రక్షణ లభిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: జూన్ కార్ల అమ్మకాల్లోనూ మారుతి హవా - టాటా, మహీంద్రా హోరాహోరీ రేస్
మూడో విషయం ఛార్జింగ్. సాధారణ 10A ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల 45 నిమిషాల సమయం అవసరం. అదనంగా లభించే 27A ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 1 గంట 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. త్వరగా ప్రయాణం ప్రారంభించాల్సిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
నాలుగో అంశం పనితీరు. Revolt RVXలో 4kW మిడ్-డ్రైవ్ Permanent Magnet Synchronous Motorను అమర్చారు. ఈ మోటార్ గరిష్టంగా 5.3kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రానికి 230Nm టార్క్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చైన్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి వెనుక చక్రానికి చేరుతుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అయితే ఈ టాప్ స్పీడ్ Boost Modeలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మోటార్ పరిస్థితులను బట్టి మాత్రమే Boost Mode పనిచేస్తుంది. అవసరమైతే బైక్ ఆటోమేటిక్‌గా Sport Modeకు మారుతుంది. Sport Modeలో గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
ఇది కూడా చదవండి: దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు - జూన్ సేల్స్‌లో TVS నంబర్ వన్; Bajaj, Ather, Vida జోరు
ఐదో అంశం సైజ్ & రైడింగ్ సౌకర్యం. Revolt RVX సీట్ ఎత్తు 815 మిల్లీమీటర్లు. కర్బ్ వెయిట్ 120 కిలోలు. ముందు & వెనుక భాగాల్లో 17 అంగుళాల అలాయ్ వీల్స్ అందించారు. ముందు 90/80-17 & వెనుక 110/80-17 ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. అలాగే 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో నగర రోడ్లతో పాటు గుంతలు ఉన్న మార్గాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు.
మొత్తంగా చూస్తే... మంచి రేంజ్, వేగవంతమైన పనితీరు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రిమూవబుల్ బ్యాటరీ & ఆధునిక ఫీచర్లతో ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా Revolt RVX నిలుస్తోంది. నగర ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వాళ్లకు కూడా ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
