టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ మేటర్ సరికొత్త ఆవిష్కరణ రెడీ అవుతోంది. దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందించింది. తాజాగా తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దేశంలోనే తొలి గేర్డ్ బైక్ ను రూపొందించిన ఘనత తమకే దక్కుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ఇంటిగ్రేటెడ్, హై-ఎనర్జీ డెన్సిటీ, 5 kWh పవర్ ప్యాక్‌ని కలిగి ఉంటుందని తెలిపింది. ఈ బైక్ ఇంట్లోనే రూపొందించడం విశేషం. అంతేకాదు, మొదటి లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.
ఒక్క చార్జ్ తో 150 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం
హైపర్ షిఫ్ట్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఈ బైక్ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. 10.5kW ఎలక్ట్రిక్ మోటార్ సీక్వెన్షియల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. టోర్క్, ఒబెన్‌తో సహా ప్రస్తుత ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల కంటే బ్యాటరీ ప్యాక్ పెద్దది. దాదాపు 150 కిలో మీటర్ల పరిధిని అందిస్తోంది. మోటార్ సైకిల్ స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. స్టాండర్డ్ ఆన్ బోర్డ్ 1kW ఇంటెలిజెంట్ ఛార్జర్ తో ప్రామాణికంగా వస్తుంది. ఆన్ బోర్డ్ ఛార్జర్ 5 గంటలలోపు వాహనాన్ని ఛార్జ్ చేయగలదు.
ఉపయోగకరమైన ఫీచర్లు
డిజైన్ ఎడ్జీగా ఉంటుంది. నేక్డ్ మోటార్ సైకిల్ ను పోలి ఉంటుంది. బై-ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్స్, బాడీ-ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్స్, ష్రౌడ్, మోటారుకు జోడించబడిన ఎక్స్ పోజ్డ్ స్పిన్నర్ ఉన్నాయి. బోర్డులో సాంకేతికత పరంగా, 4G ఆండ్రాయిడ్ కనెక్టివిటీతో టచ్-ఎనేబుల్డ్ 7-అంగుళాల వెహికల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిమోట్ కమాండ్ లతో కనెక్ట్ చేయబడిన మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. ఇతర ఫీచర్లు లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానీటరింగ్, రైడర్‌కు పర్సనలైజ్డ్ రైడ్ స్టార్టిస్టిక్స్ అందిస్తుంది. ఛార్జింగ్ స్థితి, పుష్ నావిగేషన్ అలర్ట్ ఉంటుంది. రివర్స్ ఫీచర్ తో పాటు కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. భద్రత పరంగా, ABS తో ముందు/వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
బైక్ పేరు, ధర వెల్లడించని కంపెనీ
అయితే, ఈ మోటార్‌సైకిల్ పేరును వెల్లడించలేదు. ధర వివరాలను కూడా బయకు వెల్లడించలేదు. ప్రారంభ ధరలతో పాటు బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ముగుస్తాయి. మొత్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కు మార్కెట్లో మంచి స్పేస్ ఉంది. అందులో భాగంగానే ఈ బైక్ సైతం మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రెడీ అయిన ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. ఈ కొత్త మోటార్ సైకిల్ గురించి మరింత సమాచారం త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
Read Also: టీవీఎస్ ఐక్యూబ్ - ఓలా ఎస్1 ఎయిర్, వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అంటే?