దేశంలోని అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి  నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఫాస్ట్ ట్యాగ్ మూలంగా టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ సాయంతో ఫాస్ట్ ట్యాగ్ పని చేస్తుంది. టోల్ ప్లాజా నుంచి వాహనం వెళ్తున్న సమయంలో టోల్ ఫీజు ఫాస్ట్‌ టాగ్‌ కు లింక్ చేసిన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది.  


వాహనదారులు  ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లో డబ్బులు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రీఛార్జ్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు తమ వినియోగదారులు ఈజీగా టోల్ రీఛార్జ్ సహా పలు చెల్లింపులు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇన్‌ స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ లో సులభంగా ఫాస్ట్‌ ట్యాగ్ రీఛార్జ్ చేయడానికి IDFC ఫస్ట్ బ్యాంక్ తాజాగా వాట్సాప్‌ తో చేతులు కలిపింది. పేమెంట్స్ ఆఫ్ వాట్సాప్‌' ఫీచర్ ను ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్  కోసం బ్యాంక్ కస్టమర్‌లకు ఎనేబుల్ చేస్తుంది.  IDFC FIRST కస్టమర్లుకు సంబంధించిన WhatsApp చాట్‌  బాట్‌ లోనే ఫాస్ట్‌ ట్యాగ్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు.


వాట్సాప్ ఉపయోగించి మీ IDFC మొదటి ఫాస్ట్‌ ట్యాగ్‌ని రీఛార్జ్ చేయడం ఎలా చేయాలో ఇప్పుడు  తెలుసుకుందాం.. IDFC FIRST బ్యాంక్ కస్టమర్‌లు +919555555555 నెంబర్ కు వాట్సాప్ లో ‘హాయ్’ అనని పంపడం ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ చాట్‌ లో రీఛార్జ్ ఎంపికను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కస్టమర్‌లు ఆ మొత్తాన్ని నమోదు చేసి, OTP ద్వారా లావాదేవీని కన్ ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లావాదేవీని నిర్ధారిస్తూ మెసేజ్ అందుకుంటారు. ఇతర మొబైల్ యాప్ లేదంటే నెట్‌ బ్యాంకింగ్ పోర్టల్‌ లోకి లాగిన్ చేయకుండానే 'పేమెంట్స్ ఆఫ్ వాట్సాప్‌' ద్వారా రీఛార్జ్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. మిలియన్ల కొద్దీ ఫాస్ట్‌ ట్యాగ్ వినియోగదారులకు ఈ విధానం ద్వారా రీఛార్జ్ చేసుకోవడం సులభంగా ఉంటుంది.


వాట్సాప్‌ చెల్లింపులను వినియోగదారులు తమ కాంటాక్ట్‌  నంబర్ నుంచి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ద్వారా వాట్సాప్ మెసేజ్ పంపినంత సులభంగా డబ్బు పంపడానికి ,   స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి చెల్లింపు కోసంయూజర్ తన వ్యక్తిగత UPI-PINని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.  IDFC ఫస్ట్ బ్యాంక్ కు సంబందించిన  WhatsApp బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా వినియోగదారులు పొదుపు ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌లు, రుణాలు, FASTag కోసం 25కి పైగా సేవలను  యాక్సెస్  చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది.


IDFC ఫస్ట్ బ్యాంక్  ఇప్పటి వరకు దాదాపు 9 మిలియన్ ఫాస్ట్‌ ట్యాగ్‌లను జారీ చేసింది. 420 టోల్ ప్లాజాలు,  20 పార్కింగ్ ప్రదేశాలలో ఫాస్ట్‌ ట్యాగ్ ద్వారా చెల్లింపుల అనుమతిస్తున్నది. నెలవారీ టోల్ విలువ ప్రాసెసింగ్‌ లో 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. IDFC ఫస్ట్ బ్యాంక్  వినియోగదారులు HPCL పెట్రోల్ పంపుల దగ్గర కూడా చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దాదాపు 19,000 HPCL అవుట్‌ లెట్‌లలో 'పేమెంట్స్ ఆఫ్ వాట్సాప్‌' ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది.