Kia Carens Clavis Review Telugu: కియా కేరెన్స్‌కు రిఫ్రెష్‌డ్‌ అవతార్‌గా వచ్చిన కియా కేరెన్స్‌ క్లావిస్‌, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఫీచర్లతో నిండుగా మార్కెట్లో నిలిచింది. టర్బో పెట్రోల్‌, డీజిల్‌ వంటి శక్తిమంతమైన ఆప్షన్లు ఉన్నప్పటికీ, ఈ రేంజ్‌లో నిజమైన వాల్యూ ఇస్తున్న వేరియంట్‌ ఏదంటే… అది 1.5 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ మాన్యువల్‌ అని చెప్పాలి.

Continues below advertisement

డిజైన్‌ & ఇంజినీరింగ్‌

క్లావిస్‌, MPV సిల్హౌట్‌ను అలాగే కొనసాగిస్తూనే, మరింత మోడర్న్‌ లుక్‌తో కనిపిస్తుంది. HTE (O) వేరియంట్‌లో LED DRLs, కనెక్టెడ్‌ టెయిల్‌ ల్యాంప్స్‌ లేకపోయినా, కాంట్రాస్ట్‌ స్కిడ్‌ ప్లేట్స్‌, రూఫ్‌ స్పాయిలర్‌, గ్లాస్‌ బ్లాక్‌ 15-ఇంచ్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, ఈ వీల్స్‌ సైజ్‌ కొంచెం చిన్నగా అనిపిస్తుంది.

Continues below advertisement

ఇంటీరియర్‌ స్పేస్‌ & కంఫర్ట్‌

కేరెన్స్‌ క్లావిస్‌ అసలు బలం ఇదే. బ్లాక్‌–బేజ్‌ డ్యాష్‌బోర్డ్‌, యూనిక్‌ 2-స్పోక్‌ స్టీరింగ్‌, బ్లాక్‌–బ్లూ లెదరెట్‌ సీట్లు ఈ ఎంట్రీ వేరియంట్‌కే వస్తాయి. మూడు వరుసలలోనూ సీటింగ్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఆరు అడుగుల ఎత్తు ఉన్నవారు కూడా చివరి వరుసలో ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. 216 లీటర్ల బూట్‌ స్పేస్‌ డైలీ ఫ్యామిలీ యూజ్‌కు సరిపోతుంది.

ఫీచర్లు & సేఫ్టీ

ఎంట్రీ లెవల్‌ అయినా ఫీచర్ల విషయంలో క్లావిస్‌ ఎక్కడా రాజీ పడదు. 8-ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌, వైర్లెస్‌ Android Auto, Apple CarPlay, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, రియర్‌ AC వెంట్స్‌, రివర్స్‌ కెమెరా వంటి ఫీచర్లు స్టాండర్డ్‌. సేఫ్టీగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, TPMS, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్స్‌ ఇస్తారు.

పెర్ఫార్మెన్స్‌ & డ్రైవింగ్‌ అనుభవం

1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 115hp పవర్‌, 144Nm టార్క్‌ ఇస్తుంది. ఇది స్మూత్‌గా, రిఫైన్‌డ్‌గా పనిచేస్తుంది. 3000rpm తర్వాత ఇంజిన్‌లో మంచి స్పందన కనిపిస్తుంది. అయితే డీజిల్‌ లేదా టర్బో పెట్రోల్‌లా మిడ్‌రేంజ్‌ పంచ్‌ ఉండదు. ఓవర్‌టేక్‌ల సమయంలో గేర్‌ సెలక్షన్‌ ముఖ్యం. 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, క్లచ్‌ చాలా లైట్‌గా ఉంటాయి.

మైలేజ్‌, రైడ్‌ & హ్యాండ్లింగ్‌

కంపెనీ క్లెయిమ్డ్‌ మైలేజ్‌ 15.34kmpl మాత్రమే అయినా, ప్రశాంతంగా డ్రైవ్‌ చేస్తే రియల్‌ వరల్డ్‌లో సరైన మైలేజ్‌ వస్తుంది. సస్పెన్షన్‌ కొంచెం గట్టిగా ఉన్నా, రోడ్‌ బంప్స్‌ను బాగా అబ్జార్బ్‌ చేస్తుంది. హ్యాండ్లింగ్‌ సురక్షితంగా, ఊహించిన విధంగా ఉంటుంది.

ధర & ఫైనల్‌ వెర్డిక్ట్‌

కియా కేరెన్స్‌ క్లావిస్‌ 1.5 పెట్రోల్‌ ధర రూ.11.07 లక్షల నుంచి రూ.13.01 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంది. టర్బో పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్ల కంటే తక్కువ ధరలో ఎక్కువ కంఫర్ట్‌, అవసరమైన ఫీచర్లతో ఉన్న పెట్రోల్‌ వేరియంట్‌, నిజమైన వాల్యూ పిక్‌. పెర్ఫార్మెన్స్‌ కంటే ఫ్యామిలీ కంఫర్ట్‌, సులభమైన వాడకం కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.