Hyundai Venue New Variant: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన వెన్యూ కారును అప్‌డేట్ చేసింది. కంపెనీ ఇప్పుడు హ్యుందాయ్ వెన్యూ మోడల్‌లో ఎస్(వో)+ వేరియంట్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త వేరియంట్‌కు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ యాడ్ చేశారు. అదే సమయంలో ఈ కొత్త కారులో ప్రజలు కోరుకునే మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు కూడా జోడించారు. ఈ కారులో కొత్త కనెక్టివిటీ కూడా అందించారు. దీని సహాయంతో మీరు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.


ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్(వో)+ వేరియంట్‌లో కంపెనీ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 82 బీహెచ్‌పీ పవర్‌తో 114 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 350 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయి ఉంది.


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి


ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే కంపెనీ కొత్త హ్యుందాయ్ వెన్యూలో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కూడిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను అందించింది. ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో పాటు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay ఫీచర్ కూడా ఈ కారులో కనిపిస్తుంది. అదే సమయంలో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు టీఎఫ్‌టీ డిస్‌ప్లే కూడా హ్యుందాయ్ వెన్యూ కొత్త కారులో అందించారు.


హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్‌లో కంపెనీ టీపీఎంఎస్ హైలైన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, హిల్ అసిస్ట్ కంట్రోల్‌, వెనుక కెమెరాతో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లను అందించింది.


ధర ఎంత?
హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్‌ను కంపెనీ రూ. 9.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్‌లో విడుదల చేసింది. బడ్జెట్ విభాగంలో ఇది ఒక అద్భుతమైన కారు అని కూడా అనుకోవచ్చు. మార్కెట్లో ఈ కారు మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి వాహనాలతో పోటీ పడగలదు.


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్