హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి సరికొత్త కారును అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీన్ని Hyundai Venue N Line మోడల్‌గా కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. సెప్టెంబర్ 6న Venue N Line ధరలను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రోబ్లాక్స్ లో అందుబాటులో  ఉన్న హ్యుందాయ్ మొబిలిటీ అడ్వెంచర్ అనుభవంతో  మెటావర్స్‌ లో కొత్త N లైన్ మోడల్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్‌ లు,  ల్యాప్‌ టాప్‌ లలో ప్లే స్టోర్ ద్వారా రోబ్లాక్స్ యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు కొత్త వెన్యూ ఎన్ లైన్ లాంచ్‌ ను చూడగలుగుతారని వెల్లడించింది.  వర్చువల్ లాంచ్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపింది.


ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ మరియు సర్వీస్) తరుణ్ గార్గ్ పలు విషయాలను ప్రస్తావించారు. లేటెస్ట్ టెక్నాలజీతో వినియోగదారుల అనుభవవాలను మొబిలిటీకి మించి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తమ తదుపరి ప్రొడక్ట్ అయిన హ్యుందాయ్ VENUE N లైన్‌ త్వరలోనే వినియోగదారులకు పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించారు. మెటావర్స్‌ లో లీనమయ్యే, ప్రత్యేకమైన కారు లాంచ్ అనుభవం ద్వారా ఈ కారును పరిచయం చేయడానికి రోబ్లాక్స్‌ లో ఒక రకమైన అనుభవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.


Metaverse లాంచ్ ఈవెంట్ ఇండియా జోన్, టెస్ట్ డ్రైవ్ ట్రాక్, VENUE N లైన్ జోన్, వర్చువల్ షోరూమ్, సర్వీస్ సెంటర్, మినీ గేమ్, N లైన్ మర్చండైజ్ సహా అనేక వినూత్న అనుభవాలను కలిగి ఉంటుంది. వినియోగదారులు ఓవల్ రోడ్ ట్రాక్ చుట్టూ వెన్యూ N లైన్టె టెస్ట్ డ్రైవ్‌ను వర్చువల్‌ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు మీరు కాస్త టెక్నాలజీ మీద అవగాహన ఉంటే చాలు. మీరు ఇంటి నుంచే ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరో వారంలోనే కస్టమర్లకు తెలియజేయనున్నారు. 


హ్యాందాయ్ నుంచి టక్సన్ ఎస్‌యూవీ, ధర ఎంతంటే..: హ్యూందాయ్ ఇటీవలే ఫోర్త్ జనరేషన్ టక్సన్ ఎస్‌యూవీ ధరను రివీల్ చేసింది. ఇటీవలే ఈ కారు రెండు ట్రిమ్ లెవల్స్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటిలో బేస్ మోడల్ అయిన ప్లాటినం ట్రిమ్ ధర రూ.27.69 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన సిగ్నేచర్ ట్రిమ్ మోడల్ ధర తెలియరాలేదు. దీనికి సంబంధించిన బుకింగ్స్ గత నెల జులై 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. ముందు వెర్షన్ కంటే మెరుగైన ఫీచర్లతో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో లెవల్ 2 ఏడీఏస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం) సహా మొత్తం 60కి పైగా కనెక్టివిటీ ఫీచర్లను కంపెనీ అందించింది. ఈ కారుకు ప్రధాన ఆకర్షణ ఇవే.


Also Read: యాక్టివా ప్రీమియం ఎడిషన్ వచ్చేసింది, అదిరిపోయే లుక్, కళ్లు చెదిరే ఫీచర్స్ - ధర ఎంతంటే..
Also Read: అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో సామాన్యుడి కారు- Alto K10 ప్రత్యేకతలు ఇవే!