Hyundai 4th-gen Tucson Discontinued In India: భారత మార్కెట్‌లో, హ్యుందాయ్‌, తన ప్రీమియం SUV టుక్సన్‌కు గుడ్‌బై చెప్పింది. 2022లో నాల్గవ తరం టుక్సన్‌ను (4th-gen Hyundai Tucson) హ్యుందాయ్‌ గ్రాండ్‌ లాంచ్‌తో ప్రవేశపెట్టినప్పటికీ, కేవలం మూడు సంవత్సరాలకే కంపెనీ దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం ద్వారా, హ్యుందాయ్‌ తన ప్రీమియమ్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ SUV సెగ్మెంట్‌ నుంచి తాత్కాలికంగా బయటకు వచ్చింది.

Continues below advertisement

అమ్మకాలు తగ్గి, మార్కెట్‌ తగ్గుముఖంహ్యుందాయ్‌ టుక్సన్‌ 2023లో అత్యధికంగా అమ్ముడైనప్పటికీ, ఆ తర్వాత విక్రయాలు తీవ్రంగా తగ్గాయి. ₹30–₹40 లక్షల SUV రేంజ్‌లో మొత్తం మార్కెట్‌ డిమాండ్‌ క్షీణించడంతో, Jeep Compass, Citroën C5 Aircross వంటి మోడల్స్‌ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. 2023లో టుక్సన్‌ అమ్మకాలు 3,692 యూనిట్లకు చేరినప్పటికీ, 2024లో సేల్స్‌ సగానికి పైగా తగ్గి 1,543కు పడిపోయాయి. 2025లో ఇప్పటివరకు కేవలం 650 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.

టుక్సన్‌ ఇంజిన్‌ ఆప్షన్లు2022లో వచ్చిన ఫోర్త్‌ జెన్‌ టుక్సన్‌ 2.0 లీటర్‌ పెట్రోల్‌ & డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభించింది. పెట్రోల్‌ వెర్షన్‌ 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో, డీజిల్‌ వెర్షన్‌ 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌తో వచ్చింది. అదనంగా ఆల్‌-వీల్‌ డ్రైవ్‌ (AWD) వెర్షన్‌ కూడా లభ్యమైంది.

Continues below advertisement

ధర & మార్కెట్‌లో స్థానం₹27.7 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర వద్ద ప్రారంభమైన ఈ SUVని హ్యుందాయ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో నిలబెట్టాలనుకుంది. కానీ CKD (Completely Knocked Down) అసెంబ్లీ కారణంగా ధర ఎక్కువగా ఉండటంతో, BMW X1, Audi Q3, Volkswagen Tiguan వంటి లగ్జరీ SUVలతో పోటీలో టుక్సన్‌ వెనుకబడి పోయింది. మరోవైపు, హ్యుందాయ్‌ సొంతమైన Creta, Alcazar మోడల్స్‌ తక్కువ ధరలో దాదాపు అవే ఫీచర్లు అందించడం కూడా టుక్సన్‌ మార్కెట్‌ స్థాయిని దెబ్బతీసింది.

ఎందుకు ఫెయిల్‌ అయింది?టుక్సన్‌ డిజైన్‌, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ, భారత మార్కెట్‌లోని బలమైన బంప్‌ అయిన ప్రైసింగ్‌ సెన్సిటివిటీని దాటలేకపోయింది. క్రెటా ధరల కంటే ఎక్కువైన వెంటనే SUV డిమాండ్‌ క్షీణిస్తుందని గణాంకాలు చూపిస్తున్నాయి. అంతేకాదు, కంపెనీ దృష్టి ఎక్కువగా Venue, Exter, Creta వంటి హై-వాల్యూమ్‌ మోడల్స్‌పైనే ఉండడంతో టుక్సన్‌కు ప్రచార మద్దతు కూడా తక్కువగా లభించింది.

భవిష్యత్తు ప్రణాళికలుటుక్సన్‌కు డైరెక్ట్‌ రీప్లేస్‌మెంట్‌ ఇప్పటికైతే లేదు. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఇన్వెస్టర్‌ డే సందర్భంగా, హ్యుందాయ్‌ ఒక పూర్తి సైజ్‌ ఆఫ్‌-రోడర్‌ SUV & కొత్త MPV లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్‌ టుక్సన్‌ రేంజ్‌లో ఒక ప్రీమియం SUV కొనాలనుకునేవారు ఇప్పుడు BMW X1, VW Tiguan లేదా Jeep Meridian వైపు చూడవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.