Hyundai SUVs: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మూడు ఫేమస్ ఎస్‌యూవీలను 2024లో విడుదల చేయనుంది. అవే క్రెటా, అల్కజార్, టక్సన్ అప్‌డేటెడ్ మోడళ్లు. ఈ మూడూ త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్నాయి. జనవరి 16వ తేదీన జరగనున్న కంపెనీ ఈవెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుందని అంచనా. ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో కూడిన అధునాతన డిజైన్, ఫీచర్లతో కూడిన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.


హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
కొత్త క్రెటాలో కీలకమైన అప్‌డేట్‌లు రానున్నాయి. సెల్టోస్ వంటి కొత్త ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో చూడవచ్చు. దాని ఎక్స్‌టర్నల్ డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌తో పాటు శక్తివంతమైన 160 బీహెచ్‌పీ, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. దీని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ తరహాలోనే ఉండనున్నాయి. కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లతో, కొత్త హ్యుందాయ్ క్రెటా ధర ఖచ్చితంగా పెరుగుతుందని భావిస్తున్నారు.


హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్
దీని తరువాత హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ రాబోతుంది. దీనిలో ఫీచర్ అప్‌డేట్‌లతో పాటు చిన్న డిజైన్ మార్పులు కూడా కనిపిస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన స్పై ఫొటోలు రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అప్‌డేట్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టైల్‌లైట్‌లను సూచిస్తున్నాయి. ఇంటీరియర్ అప్‌డేట్స్‌లో కొత్త సీట్ అప్హోల్స్టరీ, అప్‌డేట్ చేసిన స్టీరింగ్ వీల్, మెరుగైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చు. అల్కజార్ ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇవి  160 బీహెచ్‌పీ, 115 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.


హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్
గ్లోబల్ మార్కెట్‌లో 2024 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే లాంచ్ అయింది. మనదేశంలో 2024లో లాంచ్ అయ్యే సూచనలు ఉన్నాయి. హ్యుందాయ్ వినూత్నమైన పారామెట్రిక్ డైనమిక్స్ డిజైన్ లాంగ్వేజ్‌కు సపోర్ట్ చేసేలా, టక్సన్ ఫేస్‌లిఫ్ట్ సిగ్నేచర్ గ్రిల్ ఫీచర్లు, అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, క్లీన్ స్కిడ్ ప్లేట్‌లను కలిగి ఉంది. ఇంటీరియర్‌ విషయానికి వస్తే... కొత్త స్టీరింగ్ వీల్, అప్‌డేట్ చేసిన డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్యానెల్, అప్‌డేట్ చేసిన సెంట్రల్ కన్సోల్‌తో కొత్త లుక్ అందించారు. టక్సన్ 2.0 లీటర్ పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజన్ల ఆప్షన్లతో భారత మార్కెట్లో లభ్యమవుతుంది.


ప్రస్తుతం మనదేశ మార్కెట్లో హ్యుందాయ్ ఎక్కువగా విక్రయించే కార్లలో క్రెటా కూడా ఒకటి. అల్కజార్ కూడా డిజైన్ పరంగా పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!