హ్యుండాయ్ మనదేశంలో క్రెటాతో ఎస్‌యూవీ విభాగంలో పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే గ్లోబల్ మార్కెట్లో హ్యుండాయ్ ఇంకా పెద్ద ఎస్‌యూవీలను కూడా లాంచ్ చేస్తుంది. హ్యుండాయ్ ఇప్పటికే కొత్త టక్సన్ రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు తన అతిపెద్ద ఎస్‌యూవీ కూడా హ్యుండాయ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి పాలిసేడ్ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన 2023 మోడల్ లగ్జరీ ఫీచర్లతో లాంచ్ కానుంది.
హ్యుండాయ్ ఇప్పటిదాకా రూపొందించిన ఎస్‌యూవీల్లో అత్యంత పెద్దది ఇదే. ఇది 7-సీటర్, 8-సీటర్ మోడల్స్‌లో రానుంది. ఇందులో కొత్త గ్రిల్, వెనకవైపు మంచి స్టైలింగ్ ఉండనుంది. ఇది చాలా పెద్ద ఎస్‌యూవీ. ఇది దాదాపు 5 మీటర్ల పొడవు ఉండనుంది. దీని వెడల్పు కూడా ఎక్కువే. ఇందులో 12 అంగుళాల టచ్ స్క్రీన్ అందించారు.
దీని ఇంటీరియర్ కూడా చాలా లగ్జరియస్‌గా ఉండనుంది. మూడో వరుసకు కూడా ప్రత్యేకమైన హీటింగ్ ఫంక్షన్స్‌ను అందించారు. రెండో వరుసలో కూర్చునేవారికి విశాలమైన స్పేస్‌తో పాటు టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ కారు పెట్రోల్ వీ6 లేదా 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లాంచ్ కానుంది.
యూఎస్ మార్కెట్లో లాంచ్ అయిన వెర్షన్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంను నావిగేషన్ సిస్టంకు లింక్ చేశారు. ఈ కారులో లగ్జరీ ఫీచర్లు కూడా చాలానే ఉన్నాయి. ఒక వేళ ఇది మనదేశంలో లాంచ్ అయితే ఏయే మార్పులు చేస్తారో చూడాలి.
ఈ కారు ప్రీమియం విభాగంలో ఉండనుంది కాబట్టి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఎస్‌యూవీల కంటే డిజైన్, స్పేస్, ఫీచర్లలో ముందంజలో ఉండనుంది. ఇప్పటివరకు లాంచ్ అయిన హ్యుండాయ్ కార్లలో ఇది అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ కానుంది. ఈ కారు ఏమేరకు సక్సెస్ కానుందో తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?