Hyundai Exter CNG Boot Space: హ్యుండయ్ కంపెనీ హ్యాచ్ బ్యాక్ ధరలోనే Exter పేరుతో ఓ ఎస్‌యూవీని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. భారత్ లో ఈ చిన్న ఎస్‌యూవీ కారును గతేడాది జులైలో విడుదల చేశారు. అదే సమయంలో EX, S, SX, SX (O) వేరియంట్లను అందుబాటులోకి తెచ్చారు.


తాజాగా ఇప్పుడు హ్యుండయ్ కంపెనీ Exter లో సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. అంతేకాక Exter CNG లో డ్యుయల్ సిలిండర్స్‌ను అమర్చారు. ఈ వేరియంట్ ధరలు 8.5 లక్షల నుంచి మొదలు కానున్నాయి. ఇంకా Exter లో CNG వెర్షన్‌లో మూడు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో S, SX, Exter Knight SX వేరియంట్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ వేరియంట్ 1.2 లీటర్స్ బై ఫ్యుయల్ (పెట్రోల్, సీఎన్‌జీ) ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించనుంది. కారులో కంపెనీ నుంచే బిగించిన సీఎన్‌జీ రావడంతో దానిపై 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు.


ఈ సీఎన్‌జీ వేరియంట్‌ Exter కారు ఒక కిలో సీఎన్‌జీ ఇంధనానిక 27.1 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ బిగించిన CNG కార్లలో రూల్ ప్రకారం, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) ఉంది. అంటే మీరు పెట్రోల్ నుండి CNGకి మార్చుకోవచ్చు. లేదా సీఎన్‌జీ నుంచి పెట్రోల్ కు కూడా మార్చుకొనే వీలుంటుంది. 




ఒక్కో ట్యాంక్ కెపాసిటీ 60 కిలోలు


సీఎన్‌జీ కార్లలో బూట్ స్పేస్ మిగలని సంగతి తెలిసిందే. ఆ ప్రదేశాన్ని సిలిండర్ ఆక్రమించుకుంటుంది. కానీ, ఈ Exter CNGలో డ్యుయల్ సిలిండర్ ఫీచర్ ఉంది. దీనివల్ల బూట్ స్పేస్ ఖాళీగా ఉంటుంది. అయితే, Exter Hy-CNG Duo, EXTER Hy-CNG అని రెండు వేరియంట్లు ఉండగా.. రెండో దాంట్లో డ్యుయల్ సిలిండర్ ఉండదు. సాధారణంగా డ్యుయల్ సిలిండర్స్‌లో ఒక్కో ట్యాంక్ కెపాసిటీ 60 కిలోలుగా ఉంటుంది. 


ఫీచర్స్


ఈ కారులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్టెంట్ (HAC) వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్ అయిన డ్యుయల్ సిలిండర్ Knight SX వెర్షన్ దాదాపు రూ.9.3 లక్షలు ధర ఉంది. ఈరోజుల్లో కంపెనీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కార్లు అన్నీ దాదాపు  డ్యుయల్ సిలిండర్‌తోనే ఉంటున్నాయి. దాని వల్ల బూట్ స్పేస్ మిగులుతోంది. డ్యుయల్ సిలిండర్ మోడల్స్‌లో సిలిండర్లను నిర్దిష్టమైన ప్రాంతంలో ఫిక్స్ చేసి ఉండడం వల్ల బూట్ స్పేస్ కలిసివస్తోంది. కాస్ట్ సేవింగ్స్ పరంగా చూస్తే.. Exter CNG వెర్షన్ సేల్స్‌లో దుమ్ము రేపుతుందని భావిస్తున్నారు. ఈ Exter CNG టాటా పంచ్ సీఎన్‌జీకి గట్టి పోటీ ఇవ్వనుంది.