Continues below advertisement

Hyundai Venue Features | హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త Venue కాంపాక్ట్ SUV ని ఆవిష్కరించింది. మంచి విక్రయాలతో గుర్తింపు పొందిన సబ్-కాంపాక్ట్ SUV ఇప్పుడు కొత్త డిజైన్, ఇంటీరియర్‌తో వస్తుంది. కొత్త Venue క్వాడ్ LED ల్యాంప్స్, Mini Creta వంటి డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త హ్యుందాయ్ Venue ఇప్పుడు పాతదాని కంటే 48 mm పొడవుగా, 30 mm వెడల్పుగా ఉంటుంది. ఇందులో కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. కొత్త వెన్యూ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త Hyundai Venue లో ఏం మార్పులు చేశారు

ఇప్పటివరకూ ఉన్న హ్యుందాయ్ వెన్యూతో పోలిస్తే, కారు ఇంటీరియర్‌లో మార్పులు చేశారు. దీని క్యాబిన్ మునుపటి కంటే మరింత ప్రీమియంగా మారింది. కారులో డ్యూయల్ టోన్ 12.3-అంగుళాల డిస్‌ప్లే, పెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సహా 'H ప్యాటర్న్' డాష్‌బోర్డ్ డిజైన్ ఉన్నాయి. వీటితో పాటు కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్, కొత్త సెంటర్ కన్సోల్, D కట్ స్టీరింగ్ వీల్ కూడా యాడ్ చేశారు. ఇంటీరియర్ డ్యూయల్-టోన్ కలయిక (డార్క్ నేవీ, డావ్ గ్రే) చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే Hyundai కంపెనీ దీనిని ‘కాఫీ టేబుల్ సెంటర్ కన్సోల్’ అని పిలుస్తుంది. ఇందులో మూన్ వైట్ యాంబియంట్ లైటింగ్ ఉంది.

Continues below advertisement

వీటితో పాటు వెనుక సీటులో ప్రయాణించే వారి కోసం ఇప్పుడు అనేక సౌకర్యాలు ఉన్నాయి. వెనుకవైపు టూ ఫేజ్ రీక్లైన్, సన్‌షేడ్స్, 20 mm ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది. ఇది మునుపటి మోడల్‌లో లేదని తెలిసిందే. ఫీచర్ జాబితాలో ఇప్పుడు ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక మోడ్రన్ ఫీచర్‌లను చేర్చారు.

పవర్‌ట్రెయిన్, వేరియంట్‌లు

కొత్త Venue మునుపటిలాగే ఇంజిన్ ఛాయిస్ కలిగి ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూలో Kappa 1.2L MPi పెట్రోల్, Kappa 1.0L టర్బో GDi పెట్రోల్, U2 1.5L CRDi డీజిల్ ఇంజిన్‌లు, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితో వస్తాయి. కారులో 6 మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న కొత్త Venue ఇప్పుడు మరింత పెద్దదిగా, రోడ్ ప్రజెన్స్‌లో మెరుగైన SUVగా మారనుంది. Hyundai Venue పెట్రోల్ వెర్షన్‌లో HX2, HX4, HX5, HX6, HX6T, HX8తో పాటు HX10 వేరియంట్‌లు ఉన్నాయి. డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే కారులో HX2, HX5, HX7తో పాటు HX10 వేరియంట్‌ ఉన్నాయి.