Players List of Most Centuries In Cricket: : భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం నాడు సిడ్నీ మైదానంలో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్‌కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 125 బంతుల్లో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 74 పరుగులు నాటౌట్ గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 33వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీ కావడం విశేషం. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందామా.
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన బ్యాటర్లు
1. సచిన్ టెండూల్కర్ (భారత్) - 100 సెంచరీలు
ప్రపంచంలో గొప్ప బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన టాప్-7 బ్యాటర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. భారత మాజీ ఓపెనర్ సచిన్ తన కెరీర్‌లో 100 సెంచరీలు సాధించి, ఈ ఘనత నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇందులో 51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డే సెంచరీలు ఉన్నాయి.
2. విరాట్ కోహ్లీ (భారత్) - 82 సెంచరీలు
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ 82 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు, ఇందులో 30 టెస్ట్ శతకాలు, 51 వన్డే, 1 T20 ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి.
3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 71 సెంచరీలు
ఆస్ట్రేలియా గొప్ప బ్యాటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పాంటింగ్ 71 సెంచరీలు సాధించాడు, ఇందులో 41 టెస్ట్ సెంచరీలు, 30 వన్డే శతకాలు ఉన్నాయి.
4. కుమార సంగక్కర (శ్రీలంక) - 63 సెంచరీలు
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర 4వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సంగక్కర 63 సెంచరీలు సాధించాడు, ఇందులో 38 టెస్ట్ సెంచరీలు, 25 వన్డే సెంచరీలు ఉన్నాయి.
5. జాకస్ కాలిస్ (దక్షిణాఫ్రికా) - 62 సెంచరీలు
దక్షిణాఫ్రికా గొప్ప ఆల్ రౌండర్ జాకస్ కాలిస్ అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో ఐదవ స్థానంలో ఉన్నాడు. కలిస్ తన కెరీర్‌లో 62 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడు, ఇందులో 45 టెస్ట్ సెంచరీలు, 17 వన్డే సెంచరీలున్నాయి.
6. జో రూట్ (ఇంగ్లాండ్) - 58 సెంచరీలు
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఆరవ స్థానంలో ఉన్నాడు. రూట్ ఇప్పటివరకు 58 సెంచరీలు చేశాడు. ఇందులో 39 టెస్ట్ సెంచరీలు, 19 వన్డే సెంచరీలు ఉన్నాయి.
7. హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) - 55 సెంచరీలు
దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమ్లా 55 సెంచరీలు సాధించాడు. ఇందులో 28 టెస్ట్ సెంచరీలు, 27 వన్డే సెంచరీలు ఉన్నాయి.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేళ జయవర్ధనే 54 సెంచరీలు, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా53 సెంచరీలతో 8, 9 స్థానాల్లో నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ 50 సెంచరీలు
ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో 33వ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 50 సెంచరీలు సాధించిన 10వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. హిట్‌మ్యాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 12 టెస్ట్, 33 వన్డే, 5 T20 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడు. అయితే ప్రతి ఫార్మాట్లో కనీసం 5 శతకాలు బాదిన తొలి, ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మనే.