Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంటికి ఎస్పీ సూర్య వస్తాడు. సూర్యను చూసిన అందరూ షాక్‌ అవుతారు. కేపీ శవం అనుకుని వేరే శవం దగ్గర కూర్చుని ఏడుస్తుంటారు. సూర్య అటూ ఇటూ చూస్తుంటాడు. తమకు ఏమీ తెలియనట్టు అపూర్వ ఎస్పీతో మాట్లాడుతుంది.

Continues below advertisement

అపూర్వ: ఎస్పీ గారు మా కేపీ ఎలా చనిపోయారు.

సూర్య: కొండ మీద నుంచి దూకి చనిపోయారు మేడం.

Continues below advertisement

అపూర్వ: కానీ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదండి మా కేపీ..

సూర్య: మనసులో మొలకెత్తిన భయం. మర్రిచెట్టంత వృక్షానైనా కూలుస్తుంది మేడం. ఎంతటి మనగాడినైనా భయం పిరికివాడిలా మార్చేస్తుంది. ఎప్పుడో శోభాచంద్ర గారిని హత్య చేసి ఇక దొరకను అనుకున్నాడు. దొరికే టైం వచ్చే సరికి మా అన్నయ్యను చంపిచేశాడు. రెండు మర్డర్‌ కేసులు.. అందరికీ తెలిసిపోయిందన్న అవమానం.. జైలు జీవితం తప్పదన్న నిజం. ఆ జైల్లో బతకలేనన్న బాధ. ఈ నాలుగు కలిసి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశాయి.

అని చెప్తుండగానే చెర్రి కోపంగా సూర్య దగ్గరకు వెళ్లి గల్లా పట్టుకుని..

చెర్రి: నో మా నాన్న ఆత్మహత్య చేసుకోలేదు.. నువ్వే మా నాన్ను హత్య చేసి ఇక్కడకు వచ్చి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తావా..? మీ అన్నయ్యను  చంపేశాడన్న అనుమానంతో మా నాన్ను చంపుతావా..?

అపూర్వ: చెర్రి ఆయన ఎస్పీ రా..?

చెర్రి: అయితే ఏంటి..? ఎస్పీ అవ్వొచ్చు.. డీఎస్పీ అవొచ్చు.. నాకు సంబంధం లేదు. మా నాన్ను చంపిన వాణ్ని నేను ఎలా వదులుతాను.. ఎలా వదులుతాను..

సూర్య: చూడు మిస్టర్‌ నా ఒంటి మీద చెయ్యి వేసినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి నాకు ఒకే ఒక్క క్షణం చాలు. మీ నాన్న అంతిమ యాత్ర చూడకుండా నిన్ను పోలీస్‌ స్టేషన్‌లో పెట్టగలను. కానీ అలాంటిదేం చేయను. ఎందుకంటే నాకు మానవత్వం ఉంది. నువ్వు మీ నాన్న పోయిన బాధలో ఉన్నావు. నా మీద అనుమానంతో ఆవేశపడుతున్నావు.. ఐ కెన్‌ అండర్‌ స్టాండ్‌ యువర్‌ ఫీలింగ్‌.. నేను చెప్పేది పూర్తిగా నిజం మీ నాన్నను నేను చంపలేదు. అది ఆత్మహత్యే.. అయినా చంపాలనుకుంటే అరెస్ట్ చేసిన రోజే చంపేస్తాను.. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తాను.

చెర్రి: నువ్వు కూడా ఒకటి నమ్ము ఎస్పీ.. మా నాన్న మీ అన్నయ్యను చంపలేదు.. అలాగే శోభాచంద్ర అత్తయ్యను కూడా చంపలేదు. వాళ్లను వదిలేసి నువ్వు మా నాన్నను టార్గెట్‌ చేశావు. అసలు హత్యలే చేయనప్పుడు మా నాన్న చచ్చిపోవడం ఏంటి.?

సూర్య: చూడు మిస్టర్‌ నీకంటే ఎక్కువ నాకే తెలుసు. ఎందుకంటే నేను పోలీస్‌ ఆఫీసర్‌ను కాబట్టి. ఆ రెండు హత్యలు మీ నాన్నే చేశారు. చేయించారు. ఇక ఈ టాఫిక్‌ ఇక్కడితో వదిలేద్దాం.. లేకపోతే నిన్ను పోలీస్‌ స్టేసన్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

చెర్రి: ఓ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తావా..? తీసుకెళ్లు.. తీసుకెళ్లి చంపేస్తావా..?

అపూర్వ: చెర్రి ఆగు ఆగరా..? ఎస్పీగారు వాడు చిన్న పిల్లాడు సార్‌.. ఏదో వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నాడు. ఫ్లీజ్‌ వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను..

అంటూ అపూర్వ ఏడుస్తుంది. శారద అలాగే చూస్తుండి పోతుంది. ఇంతలో అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!