Hyundai Creta Facelift Waiting Period: హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయిన సుమారు 10 రోజుల తర్వాత దాని వెయిటింగ్ పీరియడ్ వివరాలు వెల్లడించారు. కొత్త క్రెటా ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. కొత్త క్రెటా కోసం కస్టమర్‌లు 19 వేరియంట్ల ఆప్షన్‌ను కలిగి ఉన్నారు. ఇందులో ఐదు ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ట్రెండ్‌లో చూపినట్లుగా టాప్ వేరియంట్‌లకు అత్యధిక డిమాండ్ ఉంది.


2024 హ్యుందాయ్ క్రెటా వెయిటింగ్ పీరియడ్ ఇలా...
ఆటో కార్ ఇండియా తెలుపుతున్న దాని ప్రకారం హ్యుందాయ్ క్రెటా డీజిల్ ఇది 116 హెచ్‌పీ 1.5 లీటర్ యూనిట్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దీని వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువ. ఈ సమయంలో బుక్ చేసుకున్న కస్టమర్‌లు తమ క్రెటా డీజిల్ యూనిట్ డెలివరీ కోసం నాలుగు నుంచి ఐదు నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.


క్రెటా 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఎంపికతో 115 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. కొత్త 160 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా వస్తుంది. ఈ రెండు పెట్రోల్ వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంది.


2024 హ్యుందాయ్ క్రెటా వేరియంట్లు ఇవే...
ఏడు ట్రిమ్ లెవల్స్‌లో కొత్త క్రెటా కస్టమర్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లలో టాప్ స్పెక్ SX(O) ట్రిమ్‌ను ఇష్టపడుతున్నారు. క్రెటా SX(O) ధర ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆధారంగా రూ. 17.24 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉంటుంది. 1.5 పెట్రోల్ మాన్యువల్, 1.5 డీజిల్ మాన్యువల్‌తో మాత్రమే లభించే మిడ్ స్పెక్ S వేరియంట్ వరుసగా రూ. 13.39 లక్షలు. రూ. 14.82 లక్షలుగా ఉందని డీలర్ వర్గాలు వెల్లడించాయి. క్రెటాలో తక్కువ డిమాండ్ ఉన్నది వీటికే.


ఇది కాకుండా క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏడు కలర్ ఆప్షన్‌ల్లో అబిస్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఒకదానికి ఎక్కువ డిమాండ్ ఉందని తెలుస్తోంది. అలాగే టైటాన్ గ్రే మోడల్‌ను వినియోగదారులు తక్కువగా ఇష్టపడుతున్నారని కూడా తెలిసింది.


మరోవైపు ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌ను రూ. 12.85 లక్షల స్టార్టింగ్ ధరతో (ఎక్స్ షోరూమ్) విడుదల చేసింది. సీ3 ఎయిర్‌క్రాస్ ఏటీ అనేది కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన సీ క్యూబ్డ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన మొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్ కావడం విశేషం. కంపెనీ ఈ ఎస్‌యూవీని ప్లస్, మాక్స్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేయడం విశేషం. ఈ కారు 5, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంటుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!